లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

పుష్పలో విలన్ ఎవరు ? ఎంతమంది తెరమీదకు వచ్చారు

Published

on

Pushpa Film : బన్నీ నటించే న్యూ ఫిల్మ్ లో విలన్ కోసం భారీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొన్నమొన్నటి వరకూ కోలీవుడ్ హీరోని విలన్ గా చూపిద్దామనుకున్న సుకుమార్ .. అది వర్కవుట్ అవ్వకపోవడంతో బాలీవుడ్ వాళ్లను ట్రై చేశారు. వాళ్లు కూడా ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలతో బిజీగా ఉన్నారో ఏమో..బన్నీ విలన్ మీద ఇంకా క్లారిటీ రాలేదు. పుష్పకి విలన్ గా ఎంతమంది తెరమీదకొచ్చారో తెలుసా..?బన్నీ-సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న సినమా పుష్ప. రష్మిక మందాన హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే రిలీజ్ అయిన అల్లు అర్జున్ లుక్ ..ఆడియన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. పుష్ప సినిమాలో బన్నీ రా లుక్ లో మాస్ గా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీకి విలన్ గా నటించబోయే యాక్టర్ గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నారు సుకుమార్ అండ్ టీమ్.సుకుమార్ డైరెక్షన్లో హీరోతో పాటు విలన్ కి కూడా ఈక్వల్ స్పేస్ ఉంటుంది. అంతేకాదు హీరోతో పాటు ఈక్వల్ పర్ ఫామెన్స్ కూడా ఉంటుంది. అందుకే విలన్ కోసం అంతగా జల్లెడ పడుతున్నారు సుకుమార్ అండ్ టీమ్. ఫస్ట్ బన్నీకి విలన్ గా విజయ్ సేతుపతి ని ఫిక్స్ చేశారు. కానీ డేట్స్ క్లాష్ తో పాటు రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ అవ్వడంతో వేరే విలన్ కోసం ట్రై చేస్తున్నారు.విజయ్ సేతుపతి సినిమా నుంచి విత్ డ్రా అయ్యాక .. ఇంక ఇక్కడి విలన్లు ఎందుకులే సినిమా ఎలాగూ ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నాం కాబట్టి..బాలీవుడ్ విలన్ ని తీసుకుందాం అని డిసైడ్ అయ్యారట. ఇప్పుడు బాగా క్రేజ్ ఉన్న సునీల్ శెట్టి తో పాటు సంజయ్ దత్ ని లిస్ట్ లో ఉంచారు. కానీ వాళ్లు కూడా బిజీగా ఉండడంతో సుకుమార్ కి బాగా కలిసొచ్చిన జగ్గూభాయ్ నే విలన్ గా తీసుకుందాం అని మ్యాగ్జిమమ్ ఫిక్స్ అయ్యారన్న టాక్ కూడా నడుస్తోంది.జగపతి బాబు కూడ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. సుకుమార్ సినిమాల్లో జగ్గూభాయ్ విలన్ గా ఆకట్టుకున్నారు. అయితే ఈ సీనియర్ స్టార్ ని కూడా విలన్ గా కన్ ఫామ్ చెయ్యలేదు. లేటెస్ట్ గా యంగ్ హీరో నారారోహిత్ పేరు కూడా వినిపించింది. రోహిత్ ..అప్పట్లో ఒకడుండే వాడు సినిమాలో విలన్ షేడ్ చూపించడంతో ఈ యాక్టర్ కూడా విలన్ లిస్ట్ లో ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో నెక్ట్స్ వీక్ షూటింగ్ స్టార్ట్ అయ్యే పుష్ప కి విలన్ ఎవరో తెలియాలంటే వెయిట్ చెయ్యాల్సిందే.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *