వ్యాక్సిన్ రేస్ : మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఆరు కోవిడ్ వ్యాక్సిన్లు. ఏది ముందంటే?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ప్రపంచ దేశాలన్నీ కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసి క్లినికల్, హ్యుమన్ ట్రయల్స్ దిశకు చేరుకున్నాయి. రానున్న కొన్ని నెలల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. చైనాకు చెందిన ముగ్గురు అభ్యర్థులతో సహా 6 ప్రయోగాత్మక కరోనావైరస్ వ్యాక్సిన్లు 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌లో ప్రవేశించినట్లు సీనియర్ అధికారి ధృవీకరించారు.ప్రపంచవ్యాప్తంగా, COVID-19కి కారణమయ్యే SARS-CoV-2 అనే వైరస్‌ నిరోధించేందుకు వీలుగా 26 అభ్యర్థుల టీకాలు క్లినికల్ ట్రయల్స్ వివిధ దశలలో ఉన్నాయి. WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ Michael Ryan వర్చువల్ బ్రీఫింగ్ ద్వారా తెలియజేశారు.. ఆరు టీకాలను మొదటి దశలో పరీక్షించి.. సాధారణ జనాభాలో 3వ దశలో వ్యాక్సిన్లు ప్రవేశపెట్టనున్నారు. ఈ వ్యాక్సిన్ల ద్వారా వైరస్ నుంచి పెద్ద సంఖ్యలో సుదీర్ఘ కాలంపాటు ప్రజలను రక్షించగలవా లేదా అని పరిశీలించాల్సి జిన్హువా నివేదించింది.సినోవాక్, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ / సినోఫార్మ్, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ ప్రొడక్ట్స్ / సినోఫార్మ్ నుండి మూడు చైనీస్ కోవిడ్ టీకాలు ఉన్నాయి. మిగతా ముగ్గురు ప్రముఖ అభ్యర్థులను ఆక్ పర్డ్ / ఆస్ట్రాజెనెకా, మోడెర్నా / NIAID బయోఎంటెక్ / Fosun Pharma/ ఫైజర్ అభివృద్ధి చేశాయి. ఎందుకంటే ఈ ఆరింటిలో ఎవరైనా తమకు సమాధానం ఇస్తారనే గ్యారెంటీ లేదని అంటున్నారు. నవంబర్ 3 ఎన్నికలకు ముందు కోవిడ్ -19 వ్యాక్సిన్ సిద్ధంగా ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.టీకా ఎప్పుడు రెడీ అవుతుందని అడిగితే.. ఈ ఏడాది చివరిలో అంతకంటే ముందే వ్యాక్సిన్ రావొచ్చునన ట్రంప్ చెప్పారని ఓ రిపోర్టు నివేదించింది. మొత్తంమీద, 165 వ్యాక్సిన్ అభ్యర్థులు కొన్ని రకాల పరీక్షలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కరోనావైరస్ నివారించే సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్నారు. గత డిసెంబర్‌లో చైనాలో ప్రారంభమైన కరోనా వైరస్ కారణంగా ఇప్పటివరకు 708,236 మంది మరణించారు. 196 దేశాలు, భూభాగాల్లో 18,843,580 కరోనా కేసులు బయటపడ్డాయి.

Related Posts