why america makes peace deal with taliban

ఎవరీ తాలిబన్లు.. అగ్రరాజ్యం అమెరికా ఎందుకు తగ్గింది..?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అమెరికా, తాలిబన్  మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం నిబంధనలను తాలిబన్లు పూర్తిగా

అమెరికా, తాలిబన్  మధ్య రెండేళ్లుగా జరుగుతున్న చర్చలు ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చాయి. ఇద్దరి మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం నిబంధనలను తాలిబన్లు పూర్తిగా పాటిస్తే 14  నెలల్లో దశల వారీగా అమెరికా దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి పూర్తిగా వైదొలగుతాయి. కతార్ రాజధాని దోహా ఈ ఒప్పందానికి వేదికైంది. అసలు అమెరికా తాలిబన్ తో చర్చలు ఎందుకు జరపవలసి వచ్చింది…? అమెరికా, తాలిబన్ ఒప్పందం వల్ల ఆఫ్ఘనిస్తాన్‌లో శాంతి స్థాపన సాధ్యమేనా …?

శాంతి, అభివృద్ధి మాత్రం గగన కుసుమాలే:
ఆఫ్గనిస్తాన్ లో రెండు దశాబ్దాలపాటు జరుగుగుతున్న యుద్ధం వల్ల అందరూ అలిసి పోయారు. 2001 లో మొదలైన యుద్ధం ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. కొన్ని వేలమంది నాటో దళాలను ఆఫ్గనిస్తాన్ ప్రభుత్వానికి అండగా పంపింది. కానీ అమెరికా ఆశించినట్లు ఆఫ్గనిస్తాన్ లో పూర్తి స్థాయి శాంతి స్థాపన ఇప్పటికీ కలగానే మిగిలింది. అమెరికా చేతిలో చావుదెబ్బ తిన్న తాలిబన్లు తిరిగి బలం పుంజుకున్నారు. బలగాలను మళ్ళీ కూడదీసుకున్నారు. అది మొదలు ఇప్పటివరకూ ఆఫ్ఘన్ గడ్డ మీద రక్తం పారుతూనే ఉంది. ఆఫ్ఘన్ ప్రభుత్వం మీదా, నాటో దళాలపైనా తాలిబన్ దాడులు సాగుతూనే ఉన్నాయి. 2001 నుంచి ఇప్పటివరకు 2వేల 352 మంది అమెరికా సైనికులు మరణించారు. నాటో దళాలు నష్టపోయింది దీనికి అదనం. రెండు దశాబ్దాల యుద్ధం ఆఫ్ఘన్ ప్రజల జీవితాన్ని చిన్నభిన్నం చేసింది. తాలిబన్ల అణచివేత నుంచి మాత్రం ఆఫ్ఘన్ ప్రజలు బయట పడ్డారు. కానీ … శాంతి, అభివృద్ధి మాత్రం గగన కుసుమాలుగానే మిగిలిపోయాయి.

ఎవరీ తాలిబన్లు:
తాలిబన్ ఒక ఉగ్రవాద సంస్థ. ఆఫ్గనిస్తాన్ లో విదేశీ ప్రమేయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎదిగింది తాలిబన్. అలాంటి తాలిబన్లతో అమెరికా శాంతి చర్చలు ఎందుకు జరపవలసి వచ్చింది …? ఆఫ్గనిస్తాన్, ఇరాక్ దేశాల నుంచి తమ దళాలను వెనక్కి పిలిపించాలని ఒబామా హయాంలోనే అమెరికా ఒక నిర్ణయానికి వచ్చింది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ నిర్ణయాన్ని కొంత కాలం పెండింగ్ లో ఉంచారు. విషయం ఏమంటే ఇరాక్ నుంచి అమెరికా దళాలు పూర్తిగా వైదొలగితే అక్కడ ఇరాన్ ఆధిపత్యం ఏర్పడుతుందని అమెరికా భయపడుతున్నది. ఆఫ్గనిస్తాన్ విషయానికి వస్తే అదొక ప్రత్యేక పరిస్థితి. పాకిస్తాన్ … తాలిబన్ సహకారం లేకుండా ఆఫ్గనిస్తాన్ నుంచి అమెరికా దళాలను తరలించడం కష్టం. ఎందుకంటే గడచిన రెండు దశాబ్దాల్లో ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్లు బాగా పుంజుకున్నారు. అమెరికా స్థావరాల పైన, అమెరికా అనుకూల ఆఫ్ఘన్ ప్రభుత్వం మీదా అనేక దాడులకు తెగబడ్డారు. అంతే కాదు ఆఫ్గనిస్తాన్ లో తమ ప్రయోజనాలకు రక్షణ ఉండాలని కూడా అమెరికా కోరుకుంటున్నది. 

2018 నుంచి అమెరికా చర్చలు:
అన్ని కోణాలూ పరిశీలించిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తాలిబన్లతో చర్చలు తప్పదని ఒక నిర్ణయానికి వచ్చింది. 2018 లో తాలిబన్లతో అమెరికా చర్చలు మొదలు పెట్టింది. కతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. చర్చలకు అనేక అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల దాడుల వల్ల అనేక సార్లు చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడింది. మొత్తం మీద రెండేళ్ల చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి . ఫిబ్రవరి 29  … శనివారం అమెరికా , తాలిబన్ల మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది . అమెరికా తాలిబన్ చర్చల్లో గానీ … ఇప్పుడు ఒప్పందం లో గానీ ఆఫ్ఘన్ ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదు.

తాలిబాన్లకు ఇంతకన్నా ఏంకావాలి …?
అమెరికా, తాలిబన్ ఒప్పందం వల్ల ప్రాంతీయ సుస్తిరత్వం సాధ్యమా …? ఆఫ్గనిస్తాన్ లో శాంతి నెలకొంటుందా …? ఒక్కటి మాత్రం నిజం. ఈ చర్చల వల్ల ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల ప్రతిష్ట అమాంతం పెరిగింది. తాలిబాన్లకు రాజకీయపరమైన గౌరవం లభించింది. ఒక ఉగ్రవాద గ్రూపుగా ముద్రపడిన తాలిబాన్లకు ఇంతకన్నా ఏంకావాలి …? భవిష్యత్తు ఆఫ్గనిస్తాన్ రాజకీయాల్లో … అధికారంలో తాలిబాన్లకు భాగస్వామ్యం దక్కింది. దీన్ని వారు ఎలా ఉపయోగించుకుంటారు అన్న దానిపైనే రేపటి పరిణామాలు ఆధారపడి ఉంటాయి.

Related Tags :

Related Posts :