లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Health

2020లో కరోనా మహమ్మారి విజృంభించినా.. చిన్నారుల్లోనే మరణాల రేటు తక్కువ : ఎందుకో నిపుణుల మాటల్లోనే..

Published

on

Fewer Children Died in 2020 Covid-19 Pandemic : ప్రపంచమంతా 2020లో కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది.. ఎన్నో మిలియన్ల మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకూ ప్రపంచమంతా ఎంతమంది కరోనాతో మరణించారో కూడా కచ్చితమైన గణాంకాలు లేవు. కానీ, కరోనా మరణాల్లో చిన్నారుల్లో తక్కువగా ఉండటం చాలా సంతోషకరమైన విషయం అంటున్నారు నిపుణులు. కరోనావైరస్ మిలియన్ల మందిపై తీవ్ర ప్రభావం చూపిన చిన్నారుల్లో తక్కువ ప్రభావాన్ని చూపింది. అందుకే చిన్నారుల్లో కరోనాతో చాలా కొద్దిమందే మరణించారు. చిన్నారుల్లో కరోనా మరణాలు తక్కువగా ఉండటానికి అసలు కారణాలు ఏంటి అనేదానిపై నిపుణులు ప్రయత్నిస్తున్నారు. అన్ని గ్రూపుల్లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నప్పటికీ చిన్నారుల్లో మాత్రం కరోనా తీవ్రత చాలా తక్కువగా ఉందనే చెప్పాలి.

హ్యుమన్ మోరాలటీ డేటాబేస్ డేటా ఆధారంగా గ్లోబల్ టీంకు చెందిన డిమోగ్రాఫర్లు రీసెర్చ్ ప్రాజెక్టును ప్రారంభించారు. సాధారణ జనాభాలో కరోనా మరణాల రేటు బాగా పెరిగినప్పటికీ పిల్లల్లో చాలా తక్కువగా నమోదైంది. అయితే.. దీనికి జనాభా శాస్త్రవేత్తలు, శిశువైద్యులు సహా ప్రజారోగ్య నిపుణులు అది సాధ్యమేనని అంటున్నారు. కరోనా ప్రారంభంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్లు, క్వారంటైన్లు అమలు చేయడంతో చిన్నారులు కరోనా బారినపడకుండా అడ్డుకుని ఉండొచ్చునని అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి సమయంలో పిల్లలపై మరో ప్రభావం కూడా ఉందని అంటున్నారు.

తక్కువ వ్యాక్సిన్ రేట్లు, ప్రినేటల్ కేర్ తగ్గించడం వంటి మహమ్మారి ఇతర ప్రభావాలు బాల్య మరణాల రేటును పెంచుతాయని అభిప్రాయపడుతున్నారు. మహమ్మారి సమయంలో ఫ్రాన్స్, జర్మనీ వంటి 38 ప్రపంచ దేశాల్లో వారం వారం చిన్నారుల్లో మరణాల రేటుపై డేటాను విశ్లేషించారు. మునుపటి ఏళ్లతో పోలిస్తే.. 2020లో 15ఏళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులు తక్కువగా మరణించినట్టు డేటాలో తేలింది. అందులో కోవిడ్ సంబంధిత మరణాలతో కలిపి కూడా చాలా తక్కువ.

2020లో అమెరికాలో 26వేల మంది చిన్నారులు మృతిచెందారు. 2019తో పోలిస్తే 2020లో జనవరి నుంచి నవంబర్ మధ్య వరకు 2,500 మంది చిన్నారులు మృతిచెందారు. మూడేళ్లకు ముందు మరణాలతో పోలిస్తే సగటున 9శాతం తగ్గినట్టు గుర్తించారు. 2017 నుంచి 2019లో సగటున 2వేల కంటే తక్కువగా చిన్నారుల మరణాలు నమోదయ్యాయి. గత ఏళ్లతో పోలిస్తే.. 2020లో చిన్నారుల మరణాల రేటు చాలా తక్కువగా ఉందని పరిశోధకులు నిర్ధారించారు.