అందరూ ఎందుకంత స్వార్ధపరులు? సైన్స్ దగ్గర సమాధానముంది…

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వాస్తవానికి స్వార్థం లేని మనిషే ఉండడు అంటారు. ఏ పని చేసినా అందులో స్వార్థాన్ని వెతుకునే వారు ఎందరో ఉంటారంటారు. అవసరమే మనిషి ప్రవర్తనను స్వార్థపూరిత పనిచేయిస్తుందని చెబుతున్నారు తత్వవేత్తలు, మనస్తత్వవేత్తలు.. శతాబ్దాలుగా స్వార్థపూరిత ప్రవర్తనపై ఎన్నో విశ్లేషణలు కొనసాగాయి కూడా. ఇప్పుడు ఓ కొత్త పరిశోధన ప్రకారం.. స్వార్థంత చేసే పనిలో ఎక్కువ ప్రయోజనాలను చూపిస్తుందని అంటున్నారు.

స్వార్థపూరితంగా ఎందుకు కనిపిస్తున్నారంటే? :
ప్రస్తుత రోజుల్లో చాలా మంది స్వార్థపూరితంగా ఎందుకు కనిపిస్తున్నారు. ఎందుకంటే వారి అవసరాలకు తొలి ప్రాధ్యానత ఇస్తున్నారు? అని అర్థం చేసుకోవాలి. కరోనావైరస్ మహమ్మారి ప్రభావంతో చాలామందిలో స్వార్థపూరిత జీవితంపై మరింత అవగాహనను పెంచిందని చెబుతున్నారు. వరుస సంక్షోభాల వల్ల తీవ్రతరమైన ఈ స్వార్థ ప్రవర్తన ఎక్కడ నుండి వస్తుందంటే స్వలాభం ఆధారిత ప్రవర్తన నుంచి వస్తుందని అంటున్నారు.

ప్రపంచంలో సమాజంలో అందరి మధ్య ఉన్నాము.. ఎల్లప్పుడూ అహాన్ని పెంచుకోవాలని చూస్తున్నాము. స్వలాభం అనేది అత్యంత ప్రాథమిక మానవ ప్రేరణగా ఆంగ్ల తత్వవేత్త థామస్ హాబ్స్ 1600లలో తెలిపారు. కానీ స్వలాభం లేకుండా వ్యవహరించలేరంటున్నారు. పరిశోధనలో సూచించినట్టుగా.. పరోపకారం, నైతిక పరిశీలనల ద్వారా మనిషి ప్రవర్తనను ప్రేరేపించవచ్చు.

ఆరోగ్యకరమైన స్వీయ సంరక్షణ, సరైన ప్రేమ స్వీయ స్వార్థమే అవుతుంది. మనస్తత్వవేత్తల అభిప్రాయం ప్రకారం.. వాస్తవానికి, మనలో చాలా మంది నిస్వార్థం నుంచి స్వార్థపూరిత క్షణాల్లో జీవిసిస్తుంటారు. స్వార్థపూరితంగా ఉండటమే జీవితంగా మారిన ఎందరో ఉంటారు.

జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీలో ప్రచురించిన 2020 అధ్యయనం ప్రకారం.. స్వీయ-ఆధారిత ప్రవర్తనకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులు జీవితంలో మెరుగ్గా ఉన్నారో లేదో తెలుసుకోవచ్చు. 2002, 2014 మధ్య ప్రజాభిప్రాయ జనరల్ సోషల్ సర్వే (GSS) కు 5,294 మంది అమెరికన్ల అభిప్రాయాలను విశ్లేషించారు వివిధ సర్వే ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ద్వారా శాస్త్రవేత్తలు స్వార్థపరులను గుర్తించారు.

68శాతం మందిలో డబ్బే స్వార్థం :
68 శాతం మందిలో ఎక్కువ డబ్బు సంపాదనే స్వార్థంతో కూడిన సాధారణ లక్షణమని పరిశోధకులు విశ్వసిస్తున్నారు. వాస్తవానికి, నిస్వార్థ ప్రవర్తన ఉన్నవారికి అధిక ఆదాయంతో పాటు ఎక్కువ మంది పిల్లలు ఉన్నారని పరిశోధకల అభిప్రాయం.

నిస్వార్థత అనేది ఆలోచనలో నిండిపోతే.. కొంతమంది ఇతరుల అవసరాలను చూసుకోవటానికి ఎందుకు అంత కష్టపడతారు? అని మనస్తత్వవేత్త లిసా మేరీ బాబీ ఒక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. దానికి సమాధానంగా భావోద్వేగ మేధస్సులో ఉండవచ్చునని అన్నారు. కొంతమంది వ్యక్తులు ఇతరులు కంటే ఎమోషనల్‌గా కనిపిస్తారని ఆమె తెలిపారు.

READ  కరోనా సోకినా లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు? సైంటిస్టులు చెప్పిన రెండు కారణాలు ఇవే!

చాలామంది తమలో స్వార్థాన్ని గుర్తించడం చాలా కష్టమనే చెప్పాలి. మనస్తత్వవేత్తలు, ఆర్థికవేత్తల 2020 అధ్యయనంలో.. స్వార్థపరులు వారి అహంకార ప్రవర్తన గురించి చెడుగా భావించకుండా ఉండేందుకు వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇతరుల ప్రవర్తనపై మంచి అవగాహన పొందడం ప్రతి ఒక్కరి వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలని సూచిస్తున్నారు.

Related Posts