Home » స్టయిలిష్ డైరెక్టర్ : హెడ్ బ్యాండ్, వీరతిలకం, చేతికి దారాలు..
Published
2 years agoon
By
vamsiసినీ పరిశ్రమలో సెంటిమెంట్ లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు తెరపై తనదైన చిత్రాలను తీసి పేరు గడించిన దర్శకులలో ఒకరైన కోడి రామకృష్ణ కూడా సెంటిమెంట్ ల పట్ల నమ్మకం ఎక్కువే. తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్న కోడి రామకృష్ణ.. హెడ్ బ్యాండ్ ను కట్టుకుని ఉండేవారు. చేతికి తెల్లని వస్త్రము కుట్టుకుని, అలాగే దైవం మీద ఎక్కువ నమ్మకంతో నుదుటిన తిలకం ఎప్పుడూ ఉంచుకునేవారు. అలాగే చేతికి చాలా దారాలు, ఉంగరాలు కన్పిస్తాయి. దారాలు, ఉంగరాల సంగతి ఆలా వదిలేస్తే అందరి దృష్టిని ఆకర్షించేది తలకు కట్టిన క్లాత్. అయన దశాబ్దాలుగా హెడ్ బ్యాండ్ ని వదలటం లేదు. ఆలా ఆయనకు హెడ్ బ్యాండ్ కట్టటం ఎలా అలవాటు అయింది అనే విషయమై ఆయన స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
– నిత్యం హెడ్ బ్యాండ్ ఉంటుంది. బయటకు అడుగు పెట్టాడంటే నుదట బ్యాండ్
– ఎప్పుడూ నుదుటన ఎర్రటి వీర తిలకం ధరిస్తాడు
– వైట్ అండ్ వైట్ డ్రస్ ఆయన ఫేవరెట్. మరో రంగు దుస్తుల్లో కనిపించలేదు
– చేతికి నాలుగు ఉంగరాలు ఉంటాయి. అన్నీ జాతి రత్నాలు
– కుడి చేతికి ఎప్పుడు చూసినా నాలుగైదు దేవుడి దారాలు కట్టుకుని ఉంటారు
– ఇంట్లో పూజ చేసిగానీ బయటకు రారు.
– ‘అ’, ‘దే’ అక్షరాలు సెంటిమెంట్. ఆయన దర్శకత్వం వహించిన సినిమాల పేర్లు ఎక్కువగా ఈ రెండు అక్షరాలతో మొదలు అవుతాయి
“మండు వేసవిలో ఒకసారి షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి నా నుదిటిన ఎండ బాగా ఎక్స్ పోజ్ అవుతుందని క్లాత్ కట్టుకోమని సూచించాడు. నేను కట్టుకున్నాను. అందరు బాగుందన్నారు. మరుసటి రోజు షూటింగ్ కి వచ్చే సమయానికి చాలా అందంగా రుమాలుతో హెడ్ బ్యాండ్ తయారుచేసి పెట్టారు. అది పెట్టుకొని కొన్ని రోజుల పాటు షూటింగ్ చేశాను. అందరికి నన్ను అలా చూడడం నచ్చింది. నాకు బాగానే ఉందని అనిపించడంతో కంటిన్యూ చేశాను. అందరూ నాకు ఆ బ్యాండ్ తో అనుబంధం ఉందన్నారు. తర్వాత అది సెంటిమెంట్ గా మారిపోయింది. ఒకసారి షూటింగ్ లో ఉండగా బాలచందర్ గారు వచ్చారు. నన్ను కదలవద్దని అన్నారు. నేను అప్పుడు రంగు రంగు పూలతో ఉన్న హెడ్ బ్యాండ్ కట్టుకుని ఉన్నాను. దాని మీదకు సీతాకోకచిలుక వచ్చి వాలింది. అందుకే బాలచందర్ గారు కదలవద్దని అన్నారు. అప్పుడు బాలచందర్ గారు కూడా నాకు, ఈ బ్యాండ్ కి ఎదో అనుబంధం ఉందన్నారు. అప్పటి నుుండి సెంటిమెంట్ మరింత ఎక్కువ అయింది. అప్పటి నుంచి బ్యాండ్ లేకుండా బయటకు రాలేదని కోడి రామకృష్ణ గారు చెప్పారు.