Why MLAs can afford to take a "salary cut"  more than you

మన ఎమ్మెల్యేలు బాగా రిచ్, ‘వేతన కోత’ను మనకన్నా బాగానే తట్టుకోగలరు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడిచేసేందుకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. అన్ని రాష్టాలలలోనూ ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. తద్వారా జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు రవాణా సౌకర్యాలకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్ధపై తీవ్ర పడింది. ప్రభుత్వ కజానాను కరోనా సంక్షోభానికే ప్రభుత్వాలు వెచ్చిస్తున్నాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఉండేందుకు ఏపీ, తెలంగాణ రాష్ట ప్రభుత్వాలు తమ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరి జీతాల్లో కోతపెట్టాలని నిర్ణయించాయి. అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం తమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్టు ప్రకటించిన తొలి రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం రెండో రాష్ట్రంగా నిలిచింది. ఈ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ స్వాగతించారు. 

వేతనాల్లో కోత కాదు.. వాయిదా మాత్రమే : 
కచ్చితంగా చెప్పాలంటే.. తెలంగాణ ప్రభుత్వం.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉద్యోగుల మార్చి జీతాల్లో కోత విధించడం లేదు. వాస్తవానికి కోత కాదు.. కానీ, వాయిదాగా చెప్పవచ్చు. మార్చి వేతనాలు ఏప్రిల్ నెలలో చెల్లించదు. తర్వాత చెల్లించే అవకాశం ఉంది. మార్చి వేతనాలను ఇవ్వకుండా వాయిదా వేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ తన మొత్తం వేతనంలో 75 శాతాన్ని వాయిదా వేశారు. అలాగే ఇతర ఎమ్మెల్యేలు, బ్యూరోక్రాఫ్ట్ లు సైతం వారి వేతనంలో 60 శాతం మేర వాయిదా పడింది. అన్ని ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లో 50 శాతం వేతనాలు, నాల్గో తరగతి ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం మేర వాయిదా పడ్డాయి. ఇక పెన్షనర్లలో ఉద్యోగి కేటగిరి బట్టి వేతనాల వాయిదా పడింది. 

తెలంగాణ ఎమ్మెల్యేల వేతనాలే ఎక్కువ : 
దేశంలో తెలంగాణ ఎమ్మెల్యేలే అత్యధిక జీతాలను అందుకుంటున్నారు. ఢిల్లీలో కొన్ని ఏళ్ల క్రితం ఎమ్మెల్యేల నెలవారీ వేతనాలు రూ.50వేలతో కలిపి రూ.2.1 లక్షలు ఉండేవి) ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేలు ఢిల్లీ ఎమ్మెల్యేల వేతనాలను దాటేశారు. అయితే.. వాయిదా వేసిన వేతనాలు గ్రాస్ వేతనాలు లేదా బేసిక్ శాలరీలపై అనేది మాత్రం తెలంగాణ సీఎం కార్యాలయం స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఎమ్మెల్యేలా వేతనం నెలకు రూ.20వేలు, నెలవారీ నియోజకవర్గ అలవెన్స్ రూ.2.30 లక్షలు వరకు ఉంటుంది. కేసీఆర్‌కు ఇతర అలవెన్సులతో కలిపి నెలవారీ ప్యాకేజీ రూ.4.21 లక్షల వరకు ఉంటుంది. 

మహారాష్ట్రలో మార్చి, ఏప్రిల్ నెల వేతనాలను రెండు దశల్లో చెల్లిస్తున్నారు. సీఎం ఉద్ధవ్ థాక్రే తన కేబినెట్ లో ఎమ్మెల్యేలు కేవలం 40 శాతం మాత్రమే మార్చి వేతనాలు అందుకుంటారు. క్లాస్ A, క్లాస్ B అధికారుల్లో కేవలం 50 శాతం, క్లరికల్ స్టాప్ అధికారుల్లో క్లాస్ C వరకు మార్చి వేతనాలు 75 శాతం అందుకుంటారు. క్లాస్ D లేదా క్లాస్ IV ఉద్యోగుల్లో వేతనంలో కోత లేదు. వీరిలో ప్యూయిన్, ఆఫీసు అసిస్టెంట్లు ఉన్నారు. మహారాష్ట్ర ఎమ్మెల్యేల్లో బేసిక్ శాలరీ నెలకు రూ.67వేలు ఉంటుంది. వీరి నెలవారీ వేతనాలు రూ.2.3 లక్షల వరకు ఉంటుంది. 

ఏపీలో సీఎం, ప్రభుత్వ సిబ్బంది 100 శాతం వేతనాలు :
మరోవైపు ఏపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర ఇతర ప్రభుత్వ ఉద్యోగులందరి నుంచి 100 శాతం వేతనాలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 2 విడతలుగా చెల్లిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. వివిధ విభాగాల ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం నుంచి 100 శాతం వరకు వాయిదా వేయనున్నట్టు మంగళవారం రాత్రి ఆదేశాలు జారీ అయ్యాయి.

సీఎం, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, చైర్ పర్సన్లు, సభ్యులు (పొలిటికల్ అపాయింటీస్) అన్ని ప్రభుత్వ సొంత కార్పొరేషన్లు, స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజాప్రతినిధులందరి వేతనాలు 100 శాతం వాయిదా వేస్తున్నట్టు ఆర్డర్‌లో పేర్కొంది.

అన్ని భారత సర్వీసు అధికారుల్లో (IAS, IPS, IFS) తమ వేతనాల్లో 60 శాతం వరకు వాయిదా పడగా, ఇతర ఉద్యోగుల్లో 50 శాతం వరకు ఉంటుంది. క్లాస్ 4 ఉద్యోగుల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది, విలేజ్ ఉద్యోగులు, వార్డు సెక్రటేరియట్ సిబ్బందికి మాత్రం 10 శాతం వాయిదాతో మిగిలిన 90 శాతం వేతనాలు చెల్లించనుంది.  

Related Tags :

Related Posts :