అనంతలో టీడీపీకి బిగ్ షాక్, సడెన్‌గా సైలెంట్ అయిపోయిన పరిటాల కుటుంబం, కారణం అదేనా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అనంతపురం జిల్లా రాజకీయాల్లో పరిటాల కుటుంబానిది ప్రత్యేక స్థానం. అధికారంలోఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. కేడర్‌కు అండగా నిలబడేది ఆ కుటుంబం. రాష్ట్రమంతటా పరిటాల రవీంద్రకు అనుచరులు, అభిమానులు ఉండేవారు. ఆయన హత్య తర్వాత కూడా ఆ కుటుంబం నుంచి రవీంద్ర భార్య పరిటాల సునీత, కుమారుడు శ్రీరామ్‌ పార్టీ నేతలు, కార్యకర్తలకు భరోసాగా నిలిచేవారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ఆ కుటుంబం ఇప్పుడు సైలెంట్‌గా ఉండడం కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఎందుకీ మౌనవ్రతం?
పరిటాల రవీంద్ర హత్య తర్వాత చంద్రబాబు ఆ కుటుంబానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో గెలిచిన సునీతకు మంత్రి పదవి ఇచ్చారు. దీని వల్ల జిల్లా టీడీపీలో పయ్యావుల కేశవ్ లాంటి వాళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో పార్టీ దారుణంగా ఓటమిపాలైంది. కష్టాల్లో ఉన్న పార్టీకి, కార్యకర్తలకు పరిటాల కుటుంబం కూడా అండగా ఉంటూ పోరాటాల బాట పడుతుందనుకొన్నారు. కానీ అందుకు విరుద్ధంగా మౌనవ్రతం పాటించడం చర్చనీయాంశం అయ్యింది.

పరిటాల శ్రీరాం తీరుపై విమర్శలు:
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు మంత్రి పదవి అనుభవించి, అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని పట్టించుకోకపోతే ఎలా అంటూ జిల్లా నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. పోరాటాల ఆధారంగానే ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. అలాంటిది రవీంద్ర వారసుడిగా యువనేత పరిటాల శ్రీరాం ఆ దారిని విస్మరించడం విమర్శలకు అవకాశం ఇస్తుందంటున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ వెళ్లి బీజేపీలో చేరిపోయారు. ధర్మవరం ఇన్‌చార్జి బాధ్యతలు పరిటాల కుటుంబానికి అధిష్టానం కట్టపెట్టింది. కానీ ఇప్పటి వరకు ఆ బాధ్యతలు చేపట్టలేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు సునీత, శ్రీరామ్‌.

ఆ ఎమ్మెల్యే మౌనం వెనుక అసలు రీజన్ ఇదేనా‌?


సమస్యలు ఎదుర్కోలేక సైలెంట్ అయ్యారా?
మంచి పట్టు ఉందనుకొంటున్న ధర్మవరంలో సైతం పార్టీ భాద్యతలు చేపట్టక పోవడం వెనుక కారణాలపై చర్చ సాగుతోంది. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, సమస్యలు ఎదుర్కొనలేక సైలెంట్‌ గా ఉండాలని తల్లీకొడుకులు భావిస్తున్నారని అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అంతా తామేనన్నట్టు వ్యవహరించిన సునీత, శ్రీరామ్‌ ఇప్పుడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంతో అనుచరులతో పాటు పార్టీ కేడర్‌ నిరాశ చెందుతోంది. మొన్నా మధ్య తాడిపత్రికి నారా లోకేశ్‌ వచ్చినా సునీత, శ్రీరామ్‌ కలిసేందుకు వెళ్లకపోవడం చర్చనీయాంశం అయ్యింది.

పరిటాల కుటుంబం కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తోందా?
ఐదేళ్లు మంత్రి పదవిలో ఉన్న సునీత… పార్టీకి దూరంగా ఉండడంపై కేడర్ లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందట. ప్రస్తుత అధికార వైసీపీకి భయపడి పరిటాల కుటుంబమే దూరంగా ఉంటే కేడర్ పరిస్థితి ఏంటనే ప్రశ్నలకు పరిటాల వర్గీయులు సమాధానం ఇవ్వలేకపోతున్నారట. ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి పరిటాల కుటుంబపై అవినీతి విమర్శలు ఎక్కుపెట్టినా కౌంటర్‌ ఇచ్చేందుకు కూడా సిద్ధపడడం లేదు.

READ  విశాఖ తూర్పుపై ఫోకస్ పెట్టిన వైసీపీ.. పాత వాళ్లకు పక్కకే

పరిటాల కుటుంబం కూడా అవకాశవాద రాజకీయాలు చేస్తోందా అంటూ టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇలానే కొనసాగితే పార్టీని నిలబెట్టుకోవడం కష్టమేనంటున్నారు. అంతే కాదు.. ఆ కుటుంబం కూడా పట్టు కోల్పోయే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి యువ నాయకుడిగా శ్రీరామ్‌ అయినా జోరు పెంచుతారో లేదో చూడాలి.Related Posts