ఎందుకలా తిరుగుతుంది : పొద్దుతిరుగుడు పువ్వుకు, సూర్యుడికీ సంబంధం ఏంటో తెలుసా?!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

sunflowers turn to follow the sun Angele : సన్ ఫ్లవర్. దీన్నే పొద్దుతిరుగుడు పువ్వు అని అంటారు. ఎందుకలా అంటారంటే..పొద్దు ఎటు తిరిగితే అంటు అంటూ సూర్యుడు దిశగా ఈ పువ్వు తిరుగుతుంది.అందుకే దీన్ని పొద్దు తిరుగుడు పువ్వు అని అంటారు. పువ్వుల్లో సన్ ఫ్లవర్ అందమే వేరు. పెద్దగా అరిచేయి అంత వెడల్పుతో పసుపు పచ్చగా కనువిందు చేసే పువ్వు. పువ్వు అనే మాటే గానీ దీన్ని పూజలకు వాడరు..మహిళలుతలలో ధరించరు. అంత అందంగా ఉన్నాగానీ ఈ పువ్వుని అలంకారానికి కూడా ఉపయోగించరు.
ఆ విషయం అలా ఉంచితే పసుపు పూసినట్లు పచ్చగా మెరిసిపోయే పొద్దు తిరుగుడు పువ్వు అందం ఎంత చూసినా తనివి తీరని అందం దీని సొంతం. అసలు దాని పేరులోనే వింత ఉంది. పొద్దును బట్టి…తిరగటం అని. ఏ పువ్వులకు లేని ప్రత్యేకత అది. మరి ఈ పువ్వు ఎందుకలా సూర్యుడు తిరిగిన దిశలో తిరుగుతుంది? ఇది నిజమేనా? అని చాలామందికి వచ్చే పెద్ద డౌట్. చాలా మందిలో మెదిలే ప్రశ్న ఇది. కానీ ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చక్కగా కనిపెట్టారు.వృక్ష శాస్త్రజ్ఞులు చేసిన పరిశోధనల్లో ఈ పువ్వుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిపారు. పొద్దు తిరుగుడు పువ్వు కాడల్లోని మూలకణాల ప్రత్యేక ఎదుగుదల వల్లే సన్ ఫ్లవర్ సూర్యుడివైపు తిరుగుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పువ్వుల కాడల్లో పగటి పూట తూర్పు వైపున్న మూలకణాలు పెరగడంతో, పువ్వు అటువైపు తిరిగి అంటే సూర్యుడి ఉండే వైపునకు వంగిపోతుంది. పువ్వు ఉష్ణోగ్రతను గ్రహించడం కారణంగా ఇలా జరుగుతుందని తేల్చి చెప్పారు.చిన్నారుల్లో కరోనా తీవ్రత తక్కువ.. సిగరేట్ స్మోకింగ్‌‌తో ముప్పు ఎక్కువ!


దీని కోసం పరిశోధకులు ఓ చిన్న ప్రయోగం చేశారు. పొద్దు తిరుగుడు మొక్కల కాండాలపై ఇంక్ మార్కులు వేసారు. ఆ మొక్కల ఎదుగుదలను కెమెరాలతో చాలా ఓపికగా వేచి చూస్తూ వీడియో తీశారు. సూర్యుడి గమనానికి తగినట్లు పువ్వులు దిశను మార్చటాన్ని తెలుసుకున్నారు. మొక్కల వచ్చిన మార్పులు ఏంటి? వంటి విషయాలను పరిశోధకులు తెలుసుకున్నారు. ‘పొద్దున సూర్యుడి లేత కిరణాలు సోకగానే ఉష్ణోగ్రత బట్టి, పువ్వు తల భానుడి (సూర్యుడు) వైపు ఉండేలా మూల కణాలు పెరుగుతాయి. సూర్యుడి నుంచి ఎక్కువ శక్తి పొందటానికే ఈ సన్ ఫ్లవర్ మొక్కలు ఇలా చేస్తాయని సైంటిస్టులు తెలిపారు.కాగా, ఈ పొద్దు తిరుగుడు పువ్వుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. వంటలకే కాకుండా చాలా అవసరాలకు వాడతారు. సన్ ఫ్లవర్ నూనెను సౌందర్య సాధనాల్లో వినియోగిస్తారు. అంతేకాదు చర్మ రక్షణకు సంబంధించిన మెడిసిన్స్ లో కూడా వాడతారు. ఇందులో ఉండే విటమిన్ ‘ఇ’ కోలన్ క్యాన్సర్, డయాబెటిక్ ముప్పు నుంచి కాపాడుతుందని నిపుణులు సూచిస్తుంటారు. పొద్దు తిరుగుడు పువ్వుల్లో 30 రకాల జాతులు ఉన్నాయి.పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలతో ప్రయోజనాలు..

 • పొద్దు తిరుగుడు పువ్వు విత్తనాలు గుండెకు మేలు చేస్తాయి. ఈ విత్తనాల్లో ఉండే విటమిన్ ‘C’ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
 • వీటిలో ఉండే విటమిన్ E ఫ్రీ రాడికల్స్ నుంచీ కాపాడుతుంది. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది. ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీరోజు రెండు టీ స్పూన్ల గింజలు తింటే మనకు కావాల్సిన విటమిన్ Eలో 90 శాతం పుష్కలంగా లభిస్తుందని తెలిపారు.
 • శరీరంలో పేరుకుపోయి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి..వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ తగ్గేందుకు సహకరిస్తుంది.
 • జీర్ణశక్తిని పెంచుతాయి. ఈ సీడ్స్‌లో డైటరీ ఫైబర్ మల బద్ధకాన్ని నివారిస్తుంది.
 • క్యాన్సర్‌ను అడ్డుకోవటం సన్ ఫ్లవర్ విత్తనాలు చాలా చాలా ఉపయోగపడతాయి. ఈ విత్తనాల్లోని విటమిన్ E, సెలెనియం, కాపర్‌కి విష వ్యర్థాల్ని అడ్డుకునే శక్తి ఉంది. అంతేకాదు శరీరంలో ఉండే కణాలు దెబ్బ తినకుండా కాపాడతాయి. కొలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ సోకకుండా చేస్తాయి.
 • ఎముకలకు పుష్టి ఈ గింజలు అద్భుతంగా పనిచేస్తాయి. ఈ విత్తనాల్లో ఉండే మెగ్నీషియం… ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది. ఎముకల జాయింట్లు బాగా పనిచేసేలా ఈ గింజల్లో ఉండే కాపర్ కంటెంటె సహకరిస్తుంది.
 • నరాలకు మేలు. సన్ ఫ్లవర్ విత్తనాల్లోని మెగ్నీషియం మన నరాలకు రిలాక్స్ ఇస్తుంది.
 • మెంటల్ హెల్త్ మంచి మందు సన్ ఫ్లవర్ గింజలు. ఒత్తిడినితగ్గించి..పాజిటివ్‌గా ఉండేలా చేస్తాయి.
 • ఈ గింజల్లో ఉండే విటమిన్ E వల్ల శరీరంలో మంటలు, వాపులు తగ్గిపోతాయి. హైబీపీ కంట్రోల్ చేస్తుంది..
  మన శరీరంలోకి విష వ్యర్థాలు రాకుండా ఈ గింజల్లో ఉండే విటమిన్ E కాపాడుతుంది. అంతేకాదు డయాబెటిస్ రాకుండా అడ్డుకుంటుంది.
 • వంటకాల్లో ఈ గింజలు మంచి రుచినిస్తాయి. యోగర్ట్, రైస్, పాస్తా, శాండ్‌విచ్‌లలో వాడుతుంటారు.
 • ఈ విత్తనాలు తింటే సన్‌ఫ్లవర్ సీడ్స్… మన ఊపిరి తిత్తులను బాగు చేసి శ్వాస తీసుకోవటాన్ని తేలిక చేస్తాయి.ఊపిరి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడూ ఎదురయ్యే సమస్యల్ని నయం చేస్తాయి.కీళ్ల నొప్పుల్ని నివారిస్తాయి.

 • సీజనల్ గా వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్ల నుంచీ పిల్లల్ని కాపాడేందుకు ఈ సీడ్స్ బాగా ఉపయోగపడతాయి.
  సన్ ఫ్లవర్ విత్తనాల నూనెలో ఆయిల్‌లో విటమిన్ ఏ ఉంటుంది. అది కంటి చూపును మెరుగు పరుస్తుంది.
 • ఈ గింజల్లో ఉండే జింక్ వల్ల వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. గాయాల్ని మాన్పించే శక్తి కూడా ఈ గింజలకుంది.
 • ఈ విత్తనాల్లోని ఉండే రాగి… మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాపర్ మన శరీరానికి కావాల్సిన మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
 • ఈ గింజల్లోఉండే పోషకాల వల్ల వృద్దాప్య లక్షణాలు త్వరగా రాకుండా ఈ గింజలు ఎంతో ఉపయోగపడతాయి. చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి. ముఖ్యంగా విటమిన్ E స్కిన్ డ్యామేజ్ నుంచీ కాపాడుతుంది.
 • పైగా ఈ గింజలు జుట్టుకు కావాల్సినన్ని పోషకాలనిస్తాయి. జుట్టు రాకుండా చేస్తాయి. వెంట్రుకలకు కావాల్సిన సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటి వాటిని జుట్టుకు అందిస్తాయి. జుట్టు బాగా ఆరోగ్యంగా పెరగటానికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. అలాగే జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం అని చెబుతున్నారు నిపుణులు.

Related Tags :

Related Posts :