why we fly kites | Happy Sankranti 2019 | 10TV

సంక్రాంతి ఫీవర్ : పతంగుల కళ కళ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ : సంక్రాంతి వచ్చేస్తోంది. అప్పుడే పండుగ ఫీవర్ మొదలై పోయింది. ఊళ్లకు వెళ్లే వారితే బస్టాండులు..రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటే..మరికొందరు రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని నివాసాల్లో అప్పుడే ఘుమఘుమ వాసనాలు వచ్చేస్తున్నాయి. పిండివంటల్లో ఆడవారు నిమగ్నమయ్యారు. సంక్రాంతి అనగానే..ముందుగా గుర్తొచ్చేది పతంగులు..అదే కైట్స్…చిన్నా పెద్దా..అనే తేడా లేకుండా పతంగులను ఎగురేస్తూ ఉత్సాహంగా గడుపుతుంటుంటారు. హైదరాబాద్‌కు పతంగులకు లింక్ ఉందనే విషయం కొంతమందికి తెలియదు. 
కుతుబ్ షాహీల కాలం నుండి
కుతుబ్ షాహీల కాలం నుండి ఏటా పతంగుల పండుగ జరిగేది. నవాబుల సంతానం కైట్స్ ఎగురేసే వారు. గోల్కోండ కోటలో ఈ పండుగ జరిగేది. అప్పుడు కాగితాలతో చేసే పతంగులు..వివిధ మూలికాలతో చేసే మాంజాతో పతంగుల పోటీలు జరిగేవంట. ఆరో నిజాం కాలంలో పతంగుల పోటీలు నిర్వహించడంతో దీనికి మరింత గుర్తింపు వచ్చిందని చరిత్ర కారులు పేర్కొంటుంటారు. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అనంతరం 1985 వరకు పాతబస్తీలో ప్రతి ఏటా పతంగుల పోటీలు నిర్వహిస్తుండే వారు. 
పతంగుల సందడి…
నగరంలోని ధూల్ పేట, మల్లేపల్లి, నాంపల్లి, గుల్జార్ హౌస్, డబీర్ పురా, చార్ కమాన్ తదితర ప్రాంతాల్లో రంగురంగుల పతంగులు దర్శనమిస్తున్నాయి. వివిధ రంగుల్లో మాంజాలు రా..రమ్మని అంటూ పిలుస్తున్నాయి. వినియోగదారులతో పలు దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ కొంతమంది తరతరాలుగా వ్యాపారం చేసే వారున్నారు. పతంగుల విక్రయమే జీవనోపాధి అంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు. గతంలో వందల సంఖ్యలో కుటుంబాలు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య గణనీయంగా తగ్గుతోందంటున్నారు. 
మోజు తగ్గుతోంది…
రాను..రాను పతంగులపై కొంతమందికి మోజు తగ్గుతోంది. ఏ ఎవరు ఎగురేస్తారు. మాంజా కోసుకపోవడం…పతంగి ఎగరేసేటప్పుడు ఇబ్బందులు..ఈ తలకాయనొప్పులు మనకెందుకు…ఎంచక్కగా టీవీలు..వీడియో గేమ్స్ చూస్తూ ఎంజాయ్ చేద్దామని అనుకుంటుంటారు కొందరు. నగరం మొత్తం కాంక్రిట్ జంగిల్ అవ్వడం కూడా కొంత కారణమంటున్నారు. మైదానాలపై లేక..బిల్డింగ్‌లపై ఎక్కలేక…ఎక్కి ఎగురేసినా..విద్యుత్ స్తంభాలకు…ఇతర వాటికి పతంగులు చిక్కుకపోవడంతో కైట్స్ ఎగురేయడానికి చాలా మంది ఆసక్తి చూపడం లేదంటున్నారు. 
జాగ్రత్తలు పాటించాలి…
పతంగులు ఎగురేసే క్రమంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దలు సూచిస్తున్నారు. బిల్డింగ్‌పై ఎగురేసే క్రమంలో వెనుకా..ముందు చూసుకోవాలని..విద్యుత్ స్తంభానికి చిక్కుకుంటే దానిని తాకవద్దంటున్నారు. వివిధ రసాయానాలతో కూడిన మాంజా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు…

Related Posts