కరోనా వ్యాక్సిన్ మనకు ఎందుకు రాదంటున్నారో తెలుసా?

Why we might not get a coronavirus vaccine

కరోనా వైరస్ సంక్షోభం నుంచి పూర్తిగా బయట పడాలంటే వ్యాక్సిన్ వస్తేనే సాధ్యపడుతుందని అందరూ భావిస్తున్నారు. కానీ, వాస్తవానికి కరోనా పూర్తిగా నిర్మూలించలేమనే విషయాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. Sars-Cov-2 వ్యాక్సిన్ అభివృద్ధి ప్రాముఖ్యత ఎంతో అవసరంగా కనిపిస్తోంది. సాధారణ జీవితాన్ని కొనసాగించాలంటే కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిపై ఫాస్ట్ ట్రాక్ చేయాల్సి ఉందని యూకేకు చెందిన ఆరోగ్య కార్యదర్శి Matt Hancock తెలిపారు. కానీ, ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభం కాగా.. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ తయారీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే తమ పరిశోధన దశలో 10వేల మంది వాలంటీర్లను చేర్చుకునే దిశగా ప్రయత్నాలు చేపట్టింది. ఇంతకీ కరోనా వ్యాక్సిన్ వస్తుందా? కరోనా వ్యాధిపై వ్యాక్సిన్ పనిచేస్తుందా? అనేదానిపై ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. 

కరోనా వ్యాక్సిన్ మనకు ఎందుకు రాదో గతవారం కింద ఇంగ్లండ్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ జోనాతన్ వాన్-టామ్ ఒక విషయాన్ని వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ వస్తుందని తాము కచ్చితంగా చెప్పలేమన్నారు. వ్యాక్సిన్లు చాలా సింపుల్ గా ఉంటాయని, కానీ, ప్రాక్టీస్ విషయంలో కష్టతరంగా ఉంటాయన్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి వ్యాక్సిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అదెంతో సురక్షితం. కానీ, వ్యాక్సిన్ టైమ్ లైన్ షో ప్రకారం పరిశీలిస్తే.. అంత సులభంగా వ్యాక్సిన్ కనిపెట్టలేమని అంటున్నారు.  HIV వైరస్‌‌ కారణంగా ఎయిడ్స్‌ వ్యాపిస్తుందనడానికి శాస్త్రవేత్తలకు 30ఏళ్లకు పైగా సమయం పట్టింది. ఇప్పటివరకూ ఎయిడ్స్ కు ఎలాంటి వ్యాక్సిన్ లేదు. 1943లో డెంగ్యూ ఫీవర్ వైరస్ ను గుర్తించారు. కానీ, గత ఏడాదిలో మాత్రమే తొలి వ్యాక్సిన్ కనిపెట్టారు. ఏ వైరస్ కు కూడా వేగవంతంగా వ్యాక్సిన్ ఎప్పుడు డెవలప్ చేయలేదు. దాదాపు నాలుగేళ్లు సమయం తీసుకుంటుంది.  
Why we might not get a coronavirus vaccine

మరో సవాల్ : వ్యాక్సిన్ ఇంతకీ సేఫేనా? :
కరోనా వైరస్ వ్యాక్సిన్ వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు తీవ్రంగా పరిశోధనలు చేస్తున్నారు ప్రపంచ శాస్త్రవేత్తలు. ఇప్పుడు 100కు పైగా కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. సురక్షితమే ప్రాధాన్యతగా తీసుకోవాలి. తీవ్ర అనారోగ్యానికి ప్రయోగత్మక డ్రగ్స్ మాదిరిగా కాకుండా... ఈ వ్యాక్సిన్ బిలియన్ల మంది ఆరోగ్యంగా ఉన్నవారికి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే.. దీని అర్థం.. సైంటిస్టులు ముందుగానే తమ పరిశోధనలో జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్ లోని ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ప్రాణాంతకమా? అని నిర్ధారించుకోవాలి. 2004లో SARS వ్యాక్సిన్ కోసం సెర్చింగ్ సమయంలోనూ సైంటిస్టులు ఒక వ్యక్తిలో ఫెర్రిట్స్ కారణంగా హెపటైటిస్ వ్యాధి సొకినట్టు గుర్తించారు. వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తి చేసే యాండీ బాడీస్ ద్వారా భవిష్యతులో వచ్ఛే ఇన్ఫెక్షన్లను కలిగించవచ్చు. SARS, MERS రెండింటి వ్యాక్సిన్ ప్రయోగించిన జంతువుల్లో ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాంతకంగా మారింది. 

వ్యాక్సిన్‌‌తో వైరస్ 100శాతం అంతం కాదా? :
కరోనా వైరస్ వ్యాక్సిన్ 100 శాతం సమర్థవంతంగా పనిచేయదు. ఎందుకంటే.. వైరస్ అనేది ఎప్పుటికప్పుడూ మార్పులు చెందుతు వెళ్తుంటుంది. వాటిలోని జనటిక్ కోడ్ రిసిపెంట్ సెల్స్ మారిపోతుంటాయి. యాంటీబాడీస్ తయారు కాకుండా వ్యాధినిరోధక వ్యవస్థలోని ప్రొటీన్లను వైరస్ ముందుగానే అనుకూలంగా మార్చేసుకుంటుంది. సాధారణంగా వ్యాక్సిన్ అధిక స్థాయిలో యాండీబాడీస్ వైరస్ కు వ్యతిరేకంగా ఉత్పత్తి చేస్తుంది. ‘టి’ కణాల ద్వారా సోకిన కణాలను నాశనం చేస్తుంది. కానీ, ఒక్కో వ్యాక్సిన్ ఒక్కోలా పనిచేస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఏ రకమైన వ్యాధినిరోధకత మంచిదో ఎవరికి తెలియదు. భవిష్యతులో ఇన్ఫెక్షన్లను అడ్డుకునేందుకు వ్యాక్సిన్.. ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఉత్పత్తి చేయగలదా అంటే తెలియదని సార్స్ మమహ్మారి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కు నేతృత్వం వహించిన డెవిడ్ హెయ్మాన్ చెప్పారు. 
Why we might not get a coronavirus vaccine

అయితే.. వైరస్ మనతోనే ఉంటుందా? :
అంటే... అవుననే చెప్పాలి. కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించలేం. కేవలం వ్యాక్సిన్‌తో వైరస్‌ను అంతం చేయలేమంటున్నారు డెవిడ్ హెయ్మాన్. వైరస్ తోనే సహజీవనం చేయాల్సి ఉంటుందని అంటున్నారు. కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం... గుంపులుగా కాకుండా భౌతక దూరం పాటించడం వంటివి నిత్యమైన అలవాట్లుగా మార్చేసుకోవాలని అంటున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి ముందే యాంటీ వైరల్ లేదా యాంటీ బాడీ ట్రీట్ మెంట్ కలిగి ఉండాలన్నారు. మరణాల రేటు తగ్గాలంటే వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే సకాలంలో చికిత్స అందించాలని అన్నారు. కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా ఉండేందుకు రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, అన్ని రద్దీ ప్రదేశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణంతో పాటు వాడిన మాస్క్ లను మళ్లీ వాడకపోవడమే ఎంతో మంచిదన్నారు. కరోనా వైరస్ ఎప్పుడు అంతం అవుతుందో చెప్పలేమన్నారు. వైరస్ ఎన్నాళ్లు మనతో కలిసి ఉంటుందో అర్థం చేసుకోలేమని చెప్పారు. 

మరిన్ని తాజా వార్తలు