భార్య కరోనా సాంపిల్స్‌ పనిమనిషి పేరుతో పంపించిన డాక్టర్ : ఎవరికీ తెలీకూడదని అందరికీ అంటించేశాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వచ్చిన వ్యక్తులను ఏదో అంటరానివారిగా చూస్తున్న సందర్భాల గురించి వింటూనే ఉన్నాం. అలాగే తమకు కరోనా వచ్చిందనే విషయాన్ని బైటకు తెలిస్తే ఎటువంటి వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందోనే చాలామంది గుట్టుగా ఉంటున్నారు. అటువంటి ఓ డాక్టర్ తన భార్యకు కరోనా వచ్చిందనే అనుమానంతో నమూనాలను వేరే వ్యక్తి పేరుతో పంపించిన ఘటన మధ్యప్రదేశ్ లోజరిగింది.

వివరాల్లోకి వెళితే..అభయ్‌ రాజన్‌ సింగ్‌ అనే డాక్టర్ సింగ్రౌలీలోని ఖాతుర్‌ హెల్త్‌ సెంటర్‌లో గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు.కరోనా విధులు నిర్వహిస్తున్న అభయ్ రాజన్ సెలవు తీసుకోకుండానే తన కుటుంబంతో కలిసి జూన్‌ 23న ఉత్తరప్రదేశ్‌లో తన బంధువుల పెళ్లికి వెళ్లాడు. పెళ్లి వేడులకు అయిపోయిన తరువాత రాజన్ కు‌టుంబం జూలై మొదటి వారంలో సింగ్రౌలికి తిరిగి వచ్చారు.
ఈ క్రమంలో అభయ్‌ భార్యకు దగ్గుతో పాటు జ్వరంతోపాటు కరోనా లక్షణాలు బైటపడటంతో ఆమె నమూనాలను సేకరించిన అభయ్ రాజన్ ఎవరికి అనుమానం రాకూడదని తన ఇంట్లో పనిచేసే పనిమనిషి పేరుతో కరోనా టెస్టులు చేసే సెంటర్ కు పంపించాడు. ఆ నమూనాలను పరీక్షించిన తరువాత ఆమెకు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

ఆ పనిమనిషితో ఇంకెంతమంది కాంటాక్ట్ అయ్యారో తెలుసుకునేందుకు వైద్యాధికారులు, పోలీసులు పనిమనిషి పేరుతో నమూనాలను పంపిన అడ్రస్ కు వచ్చారు. అక్కడికి వచ్చిన అధికారులు డాక్టర్ ఇంట్లో ఉండే పనిమనిషితో ఫలానా పేరుగల వ్యక్తి ఎవరు? ఆమెకు కరోనా వచ్చింది. ఎంక్వరికి వచ్చాము అని చెప్పటంతో గాబరా పడిపోయిన ఆ పనిమనిషి..కరోనా సోకింది తాను పని చేస్తున్నడాక్టర్ భార్యకని..నాకు కాదని చెప్పటంతో అసలు విషయం బైటపడింది.
దీంతో వైద్య అధికారులు అభయ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేయగా..ఈ పరీక్షల్లో అభయ్‌తో పాటు మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వారందరిని క్వారంటైన్‌కు తరలించారు. అనంతరం తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసుల్ని..వైద్య అధికారుల్ని తప్పు దోవ పట్టించినందుకు అభయ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అలాగే అభయ్ ఎంతమందితో కాంటాక్ట్ అయ్యాడని తెలుసుకున్నారు. అలా జులై 1 తర్వాత అభయ్‌ను కలిసిన 33 మంది ప్రభుత్వ ఉద్యోగులు సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. వీరిలో ఒకరు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ కూడా ఉన్నారు. త్వరలోనే వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. తప్పుడు పేరుతో నమూనాలు పంపినందుకు డాక్టర్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కరోనా నుంచి అభయ్‌ రాజన్‌ కోలుకున్న తర్వాత ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

READ  జులై వరకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

Related Posts