Home » నిత్యానందే ఆదర్శం.. బలహీనతే పెట్టుబడి: ప్రదీప్ లీలలు.. టీవీల ముందు జోషీ.. తెర వెనుక దోషి.. భార్యల పోరాటం
Published
2 months agoon
By
vamsiచెప్పేవి శ్రీరంగ నీతులు, చేసేవి చెత్త పనులు అంటారు కదా? సరిగ్గా ఆ సామెతకు సూటయ్యే వ్యక్తి ప్రదీప్ జోషి. మామూలు జోషి కాదు స్వయం ప్రకటిత బ్రహ్మశ్రీ, సద్గురు డాక్టర్ ప్రదీప్ జోషి. ప్రదీప్ జోషి చీకటి బాగోతాల గురించి ఇప్పుడు తన రెండవ భార్య ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. ప్రదీప్ జోషీ మొదటి భార్య కూడా తనను ఇబ్బందులకు గురిచేసి, బలవంతంగా విడాకులు తీసుకుని, అందుకోసం ఆస్తులు రాయించుకున్నట్లుగా టీవీ ముందుకు వచ్చి వెల్లడించారు.
తన భర్తకు చాలా మందితో సంబందాలు ఉన్నాయంటూ.. టీవీల ముందు వివాహ బంధం గురించి నీతులు చెబుతూ.. వెనుక చేసేవి నీచపు పనులు అంటూ.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. టీవీ ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే శ్రేయ తనను కూడా మానసికంగా వేదిస్తున్నాడని తన ముందే, ఇతర మహిళలను తెచ్చుకునేవారు అంటూ పిర్యాదులో పేర్కొన్నారు. నిత్యానందే తనకు ఆదర్శం అంటూ.. చాలా మంది మహిళలతో సంబంధాలు కొనసాగించినట్లుగా కేసు పెట్టారు శ్రేయ.
తనను పోర్న్ వీడియోలు చూడాలంటూ వేధించేవాడని, తనకు ఉన్న పరిచాయలతో ఏమైన చేస్తానంటూ బెదిరిస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు డాక్టర్ శ్రేయ. మ్యాట్రిమోనిలో అందం, ఆస్తులు ఉన్న అమ్మాయిల ఫోటోలు చూసి పెళ్లిపేరుతో మోసాలకు పాల్పగినట్లుగా.. ప్రదీప్ జోషికి భయపడి చాలా మంది మహిళలు బయటకు రాలేకపోతున్నారంటు చెప్పుకొచ్చింది భార్య శ్రేయా. తనకు భయపడి మొదటి భార్య ఇప్పటివరకు బయటకు రాలేదని, అమ్మయిలను శారీరకంగా వాడుకుని, వారి డబ్బులను దోచుకుంటాడని, మరో మహిళ తనలా బలికావొద్దనే పోలీసులను ఆశ్రయించి, మీడియా ముందుకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు ప్రదీప్ జోషి భార్య.
నిన్ను నీకు పరిచయం చేసేదే ధ్యానమూ.. నిన్ను నీచే సరిదిద్దించేదే యోగా అంటూ సుక్తులు వల్లించే ప్రదీప్ జోషిపై 498A, 406, 420, 506 సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. డాక్టర్ శ్రేయా ఫిర్యాదు మేరకు ప్రదీప్ జోషిపై FIR నమోదు చేశారు పోలీసులు. బంధాలు, అనుబంధాలు ఎలా పెంపొందించుకోవాలి?
ఆయన గురించి మనకు తెలిసింది గోరంతే.. తెలుసుకోవలసింది కొండంత అంటున్నారు ఆయన భార్యలు.
తన ప్రవచనాలతో టీవీల ముందు జోషీగా.. తెర వెనుక దోషిగా మారిన ప్రదీప్ జోషీ బాధిత మహిళలు 10టీవీ స్టూడియోలో వారి బాధలను గురించి చెప్పుకున్నారు. పోరాటానికి సిద్ధమైన ఇద్దరు భార్యలు ఇంతకుముందు వారికి చేసిన అన్యాయాలను గురించి వివరించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రదీప్ జోషి, అవతలివారి బలహీనతలను గుర్తించి క్యాష్ చేసుకునేవారు అని వివరించారు. యోగాలు, హోమాలు పేరుతో మహిళల జీవితాలను దోచుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఇతర మహిళలను ఇంటికి తీసుకుని వచ్చేవాడని, స్వామి నిత్యానందను Inspirationగా తీసుకుని అరాచకాలు చేసేవాడని చెప్పుకొచ్చారు.
శ్రేయ కంటే ముందు అలేఖ్యను పెళ్లి చేసుకున్నారని, అలేఖ్య మణిపాల్‌లో ఉద్యోగం చేసేదని, ఒక బాబు ఉండడంతో అతనిని భరించిందని చెప్పారు. విడాకులుపై సంతకం చెయ్యడానికి ఆస్తులు రాయించుకున్నట్లుగా ఆమె చెప్పారు. యాగాలు, హోమాలు అంటూ బయటకు చెబుతూ ఉండే.. ప్రదీప్ జోషి అసలు రూపం బయటపడడంతో మరికొంత మంది బయటకు రావచ్చని భావిస్తున్నారు. మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రాగా.. గతంలో ఇతనిపై వచ్చిన ఫిర్యాదులను కూడా వారు విచారిస్తున్నారు.