లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

రెండో పెళ్లికి సిధ్ధమైన భర్త.. అది తెలుసుకున్న భార్య….

Published

on

wife killed her husband who was planning a second marriage in kovilpatti  : భార్య బతికుండగానే రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న భర్తను భార్య హత్య చేసిన ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టిలో చోటుచేసుకుంది.

కోవిల్ పట్టి లోని లాయల్ మిల్ కాలనీలో  నివసించే ప్రభు, ఉమామహేశ్వరి దంపతులకు ఇద్దరు సంతానం 7 ఏళ్ల బాలుడు, నాలుగేళ్ల కూతురు ఉన్నారు. ప్రభు సమీపంలోని ఒక ప్రైవేట్ మిల్లులో పనిచేసేవాడు, ప్రభు మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో రోజు తాగి వచ్చి భార్య ఉమా మహేశ్వరితో గొడవపడేవాడు.

గత కొద్ది కాలంగా ఉమా మహేశ్వరి ఆరోగ్యం సన్నగిల్లింది. ఆమె అనారోగ్యానికి గురయ్యింది. ఈక్రమంలో శుక్రవారం, జనవరి 22 అర్ధరాత్రి ఫుల్లుగా తాగివచ్చిన ప్రభు ఉమామహేశ్వరితో గొడవ పడ్డాడు. నీకు ఆరోగ్యం బాగోలేదు కనుక తాను రెండో పెళ్లి చేసుకుంటానని వాగ్వాదానికి దిగాడు. అప్పటికే భర్త ప్రవర్తనతో విసిగెత్తిపోయి ఉన్న ఉమా మహేశ్వరి సమీపంలోని కొడవలి తీసుకుని భర్త మెడపై వేటు వేసింది, రెండో సారి కొడవలి తో కొట్ట బోతే చేయి అడ్డంపెట్టినప్రభుకు చేయి తెగింది.

కొడవలి వేటుకు తీవ్ర రక్తస్రావం అవుతున్న ప్రభు అరుస్తూ బయటకు వెళ్లబోయి గుమ్మం తగిలి అక్కడే కుప్పకూలిపోయాడు. సమచారం తెలుసుకుని ఘటనాస్ధలానికి వచ్చిన కోవిల్ పట్టి పోలీసులు ప్రభు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఉమామహేశ్వరిని అదుపులోకి తీసుకున్నారు. తన అనారోగ్యాన్ని అడ్డంపెట్టుకుని ప్రభు మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని, ఆమెను వివాహాం చేసుకోటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నందున హత్య చేసినట్లు వివరించింది.తండ్రి చెనిపోవటం, తల్లి జైలు పాలవటంతో ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు.

kovilpatti