ఫేస్ బుక్ ఫ్రెండ్ తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

facebook friend lover : సోషల్ మీడియా ద్వారా అయ్యే పరిచయాలతో కాపురాలు కూలుతున్నాయని తెలిసినా… వాటి ద్వారా వివాహేతర సంబంధాలు  పెట్టుకుని బంగారంలాంటి కాపురాలను బుగ్గిపాలు చేసుకుంటున్న సంఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాము. అయినా ప్రజలు వాటపట్లే  ఆకర్షితులవుతున్నారు.

ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది హైదరాబాద్ కు చెందిన మహిళ. ఆ విషయం తెలిసి వివాహేతర సంబంధాన్ని వదులుకోమని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చెప్పినా వినకుండా ప్రియుడితో కలిసి భర్తను పరలోకాలకు పంపించిందా ఇల్లాలు.హైదరాబాద్ చాంద్రాయణగుట్ట, న్యూ ఇందిరానగర్ లో నివసించే మహ్మద్ నాసర్(31), అదే ప్రాంతానికి చెందిన హలీమా బేగం అలియాస్‌ గౌసియా(27) కొన్నేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. నాసర్ గగన్ పహాడ్ లోని పెట్రోల్ బంకులో పనిచేస్తుంటాడు.

ఇంట్లో ఉండే గౌసియాకు కొన్నాళ్లక్రితం ఫేస్ బుక్ లో ….పహాడీ షరీఫ్ కు చెందిన షేక్ బిలాల్ హుస్సేన్ తో పరిచయం అయ్యింది. ఆ పరిచయంకాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కొన్నాళ్లకు నాసర్ కు తెలిసిపోయింది. భార్యను మందలించాడు. బిలాల్ తో అక్రమ సంబంధం మానుకోమని చెప్పాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య పలు మార్లు ఘర్షణ కూడా జరిగింది.దీంతో గౌసియా భర్తను అడ్డుతొలగించుకోవాలని భావించింది. ప్రియుడు బిలాల్ తో చెప్పింది. ఇద్దరూ కలిసి ప్లాన్ చేశారు. అక్టోబర్17, శనివారం రాత్రి బిలాల్ తో కలిసి భర్తను హత్య చేయటానికి సిధ్దమయ్యారు. నాసర్ ఇంటికి వచ్చి పడుకున్న తర్వాత బిలాల్ గౌసియా ఇంటికి వచ్చాడు.

ఇద్దరూ కల్సి నాసర్ కు ఊపిరి ఆడకుండా దిండుతో మొఖంపై నొక్కి చంపేశారు. మరోసారి తాడుతో నాసర్ గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి హత మార్చారు. ఆ తర్వాత గౌసియా అత్తగారింటికి వెళ్లి గుర్తు తెలియని వ్యక్తి భర్తను గొంతు నులిమాడని చెప్పింది.అత్తకుటుంబ సభ్యులు ఇంటికి వచ్చినాసర్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. నాసర్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.


Related Tags :

Related Posts :