కొడుకు వరసయ్యే యువకుడితో ఇల్లాలు రాసలీలలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వివాహేతర సంబంధాలు కుటుంబాలను విఛ్చిన్నం చేస్తున్నఘటనలు చూస్తున్నప్పటికీ ప్రజలు వాటిపట్ల ఆకర్షితులటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ తరహా ప్రవృత్తి ఎక్కువవుతోంది.

నానాటికీ సమాజంలో కుటుంబ విలువలు కనుమరుగవుతున్నాయి. క్షణికమైన పడకసుఖం కోసం బంగారం లాంటి వైవాహిక బంధాన్ని తెంచుకోవడమే కాక…. హత్యలకు కూడా వెనుకాడటంలేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో ఓ ఇల్లాలు, వరసకు కొడుకయ్యే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుని….. ప్రియుడి  సహకారంతో భర్తను హతమార్చింది.తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరులో నివసించే జంకల అప్పారావు(37) అలియాస్ వరహాలుకు 14ఏళ్ల క్రితం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన మంగతో వివాహాం అయ్యింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. పెళ్లైన నాటి నుంచి వీరి వివాహా బంధం కలహాల కాపురం లాగానే సాగుతోంది. భార్యా భర్తలు తరచూ గొడవపడుతూ ఉండేవారు.

ప్రియురాలిపై స్నేహితుడితో కలిసి హత్యాచారం.. ప్రియుడు అనుమానాస్పద మృతి


అప్పారావు రోజూ తాగొచ్చి భార్యను కొట్టేవాడని తెలిసింది. పెళ్లైన నాటి నుంచి కాపురం సక్రమంగా లేకపోయేసరికి మంగ వాళ్ల స్వగ్రామంలోని జంకల మణికంఠ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడు మంగకు కొడుకు వరసవుతాడు. చాలాకాలం గుట్టుగా సాగిన వీరి అక్రమ సంబంధం చివరకు అప్పారావుకు తెలిసి పోయింది.భార్య అక్రమ సంబంధం గురించి  అప్పారావు మందలించాడు. కొడుకు వరసయ్యే వ్యక్తితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో అప్పారావు తీవ్ర మనస్తాపానికి గురైనట్లు స్ధానికులు అన్నారు. భర్త రోజూ తాగొచ్చిహింసించటమే కాక తన అక్రమ సంబంధాన్నిప్రశ్నించటాన్ని తట్టుకోలేకపోయింది మంగ. భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ఇదే విషయాన్ని ప్రియుడు మణికంఠతో చెప్పింది.ఇద్దరూ పధకం ప్రకారం బుధవారం రాత్ర అప్పారావును హత్య చేశారు.

రోజు లాగానే అప్పారావు బుధవారం రాత్రి తాగి ఇంటికొచ్చి…. భార్యతో గొడవ పడ్డాడు. ప్రియుడు మణికంఠను రమ్మని మంగ సమచారం ఇచ్చింది. అప్పారావు తిని పడుకున్నాక… తెల్లవారు ఝూమున మూడు గంటల సమయంలో ప్రియుడితో కల్సి ….. కత్తి, కర్రతో కొట్టి భర్తను హత్య చేసింది. అనంతరం ఇద్దరూ కల్సి భర్త శవాన్ని ఇంటి వాకిట్లో ఉన్న సందెకాలుపై పడేసి ప్రమాదవశాత్తూ మరణించినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.మృతుడి శరీరంపై బలమైన గాయాలు ఉండడంతో వీరు వేసుకున్న పథకం పారలేదు. గురువారం ప్రియుడు, అప్పారావు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో మంగ భర్త హత్య విషయాన్ని బయట పెట్టింది. పోలీసులు మంగ, మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు.

READ  ప్రాణం తీసిన లాక్ డౌన్, భార్య ఎడబాటు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రత్తిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.Related Posts