లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

భర్తను చంపి, ఏమీ తెలియనట్లు కర్మకాండలు జరిపి దొరికిపోయిన భార్య

Published

on

wife kills husband with the help of father : కుటుంబ కలహాలతో ఓ భార్య తండ్రిసహాయంతో భర్తను హత్యచేసింది. భర్త కనిపించటంలేదని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉండగా భర్తకు కర్మకాండలు నిర్వహించి దొరికిపోయిన ఉదంతం జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో జరిగింది.

వరంగల్ జిల్లా పరకాల మండలం నర్సక్కపల్లికి చెందిన రమేష్ తాపీ మేస్త్రీ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య శారద, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొద్ది రోజులుగా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. దీంతోరమేష్ కుటుంబం అత్తగారి ఊరైన నేరేడుపల్లి కి వెళ్లింది.
అక్కడకు వెళ్లిన కొద్ది రోజులకు రమేష్ కనిపించకుండా పోయాడు. తనభర్త కనిపించటంలేదని భార్య శారద భూపాల పల్లి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

అనంతరం రమేష్ వాళ్ల బంధువుల ఇంటికి పెళ్లికి కూడా వెళ్లి వచ్చింది. నెల రోజుల తర్వాత చనిపోయిన వారికి జరిపించే కర్మ కాండలను తన భర్త పేరున జరిపించింది. నెలమాసికం పెట్టింది. దీంతో అనుమానం వచ్చిన బంధువులు, గ్రామస్తులు ఆమెను నిలదీశారు. దీంతోతానే భర్తను హత్యచేసినట్లు ఒప్పుకుంది.  పోలీసుల ముందు లొంగిపోయింది. తన తండ్రి సహాయంతో భర్తను హత్య చేసినట్లు పోలీసు విచారణలో అంగీకరించింది. భర్తను హత్య చేసి అనంతరం అడవిలో పాతి పెట్టినట్లు చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.