లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

చీరతో భర్తను హత్య చేసిన భార్య, కారణం తెలిస్తే మంచి పని చేసిందంటారేమో

Updated On - 7:24 pm, Mon, 22 February 21

wife murder husband with saree: తాగుబోతు భర్త పెట్టే టార్చర్ తో విసిగిపోయిన ఓ భార్య భర్త అని కూడా చూడకుండా అతడిని కడతేర్చింది. చీరతో ఉరి బిగింది భర్తను హత్య చేసింది. ఢిల్లీలోని ఫ‌తేపూర్ బేరి ఏరియాలో ఆదివారం(ఫిబ్రవరి 21,2021) రాత్రి ఈ ఘ‌ట‌న జరిగింది.

స‌రితా దేవి (35), సికంద‌ర్ సాహ్నీ (38) దంపతులు. వారికి ఇద్ద‌రు పిల్ల‌లు. వీరు ఫ‌తేపూర్ బేరి ఏరియాలో నివాసం ఉంటున్నారు. సికందర్ తాగుడుకు బానిసగా మారాడు. రోజూ త‌ప్ప‌తాగి వ‌చ్చి భార్య‌ను కొట్టేవాడు. పిల్ల‌ల ముందే అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించేవాడు. అతడి తీరుతో ఆమె విసిగిపోయింది. కట్టుకున్న మొగుడు కావడంతో మౌనంగా భరిస్తూ వచ్చింది. ఏదో ఒక రోజు అతడిలో మార్పు వస్తుందని ఆశించింది.

కాగా, ఆదివారం రాత్రి కూడా సేమ్ సేన్. పూటుగా మ‌ద్యం తాగి ఇంటికి వ‌చ్చిన భ‌ర్త.. భార్యతో గొడ‌వ‌ప‌డ్డాడు. అంతేకాదు చేయి కూడా చేసుకున్నాడు. భ‌ర్త తీరుతో విసిగిపోయిన ఆమె, ఇక లాభ లేదనుకుంది. అతడి నుంచి విముక్తి పొందాలని భావించిన ఆమె.. భర్త నిద్ర‌పోగానే చీర‌తో మెడ‌కు ఉరిబిగించి హ‌త్య‌చేసింది.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. తన భర్తను తాను హత్య చేసినట్టు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. ప‌నిపాట లేకుండా నిత్యం తిని తిర‌గ‌డ‌మే కాకుండా, రోజూ మ‌ద్యం తాగి వ‌చ్చి హింసిస్తుండ‌టంతో ఈ ప‌ని చేయాల్సి వ‌చ్చింద‌ని పోలీసుల విచార‌ణ‌లో స‌రితాదేవి వెల్లడించింది.