భార్యకు 14 మంది బాయ్ ఫ్రెండ్స్..భర్త ఏం చేశాడో తెలుసా ?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తన భార్యకు 14 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసుకున్న ఆ భర్త..ఊహించని షాక్ ఇచ్చాడు. తనకు రూ. 100 కోట్లు కట్టాలంటూ..ఆ బాయ్ ఫ్రెండ్స్ కు నోటీసులు ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రెండు వారాల్లో కట్టకపోతే..చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆ భర్త హెచ్చరించడం విశేషం. ఈ ఘటన ఎక్కడో విదేశాల్లో చోటు చేసుకోలేదు. భారతదేశంలోని కలకత్తాలో జరిగింది.

కలకత్తాలో ఉంటున్న ఓ బిజినెస్ మెన్ కు తన భార్యపై అనుమానం కలిగింది. దీంతో తన దగ్గరున్న డ్రైవర్ ను అలర్ట్ చేశాడు. వివరాలు సేకరించాలని సూచించాడు. అతను డిటెక్టివ్ అవతారం ఎత్తాడు. ఆమెకు ఏకంగా 14 మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని నిర్ధారించాడు ఆ డ్రైవర్. ఇదే విషయాన్ని ఆ బిజినెస్ మెన్ కు చెప్పాడు. వెంటనే బాయ్ ఫ్రెండ్స్ వివరాలు ఇవ్వాలని సూచించాడు.

వారందరికీ నోటీసులు పంపించాడు ఆ భర్త. వారతో శారీరకంగా సంబంధాలున్నాయని, సన్నిహితంగా ఉన్నారని తెలుసుకున్నాడు. తన వైవాహిక జీవితం సమాప్తం అయిందని, తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఏకంగా..తనకు రూ. వంద కోట్లు ఇవ్వాలంటూ నోటీసులు పంపించాడు.

దీంతో ఆ బాయ్ ఫ్రెండ్స్ షాక్ తిన్నారు. రెండు వారాల్లో కట్టకపోతే..చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పడంతో ప్రస్తుతం ఆ బాయ్ ఫ్రెండ్స్ తలలు పట్టుకుంటున్నారు.

Related Posts