ఏపీ బీజేపీకి కొత్త బాస్.. పవన్ కళ్యాణ్‌కు కష్టాలు మొదలైనట్టేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించింది. కన్నా లక్ష్మీనారాయణ తొలగించి సీనియర్ నేత సోము వీర్రాజుని అధ్యక్షుడిగా నియమించింది. ఈ నేపధ్యంలో మిత్రపక్షం జనసేనతో బీజేపీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతోంది. కన్నా, పవన్ కలిసినట్టు సోము, పవన్‌ల అభిప్రాయాలు కలుస్తాయా? గతంలోలా మిత్రపక్షాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కలుపుకొని పోతారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

పవన్‌కు సయోధ్య కుదురుతుందా?
నిన్న మొన్నటి వరకూ రాష్ట్ర బీజేపీ, జనసేన చేసే కార్యక్రమాలు, అధికార పార్టీపై చేసే ఆరోపణలు టీడీపీకి ప్లస్ అయ్యేవి. అంతే కాదు చాలా విషయాల్లో టీడీపీ లైన్‌నే ఈ రెండు పార్టీలు ముఖ్యంగా అధ్యక్షులు కన్నా, పవన్‌లు పాలో అవుతున్నారని విమర్శలు వచ్చాయి. చాలా కీలక విషయాల్లో ఇది దాదాపు రుజువు అయ్యింది. ముఖ్యగా రాజధాని విషయంలో కేంద్ర బీజేపీ వెర్షన్ ఒకలా ఉంటే, రాష్ట్ర బీజేపీ, జనసేన వెర్షన్ మరోలా ఉండేది. ఇకపై అలా జరగకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే సోము పూర్తిగా బీజేపీ లైన్ ఫాలో అవుతారు. ఏ విషయంలో అయినా పార్టీ లైన్‌నే సోము అనుసరిస్తారు. ఈ నేపధ్యంలో సోముకు పవన్‌కు సయోధ్య కుదురుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

చంద్రబాబు అంటే ఒంటికాలిపై లేస్తారు:
మాకు వైసీపీ, టీడీపీ రెండు వ్యతిరేక పార్టీలే అంటూ సోము వీర్రాజు ప్రకటించారు. రెండు పార్టీలు మా టార్గెట్ అంటున్నారు. పవన్ కూడా దాదాపు ఇలానే చెబుతున్నా కొంతైనా టీడీపీ ప్రభావం పవన్‌పై ఉంటుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. పవన్ వైసీపీ, సీఎం జగన్ పై కామెంట్స్ చేసినట్టు.. టీడీపీ అధినేత చంద్రబాబుపై చేయరు. సోము మాత్రం చంద్రబాబు అంటే ఒంటి కాలుపై లేస్తుంటారు. ఇలాంటి రెండు భిన్న స్వభావాలు కలిగిన వారి మధ్య సయోధ్య కుదురుతుందా అనేది ఇప్పుడు జనసే, బీజేపీల్లో జరుగుతోన్న చర్చ.

చంద్రబాబు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో:
మొత్తానికి బీజేపీ కొత్త బాస్‌తో కలిసి పనిచేస్తా అని పవన్ ప్రకటించారు. పవన్‌తో కలిసి పని చేస్తామని సోము వీర్రాజు కూడా ప్రకటించారు. కాకపోతే సమస్యల విషయంలో వీరిద్దరూ ఎలాంటి ముందుకెళ్తారన్ననే ప్రశ్న. సోము వీర్రాజుకు దూకుడెక్కువ. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోని అవినీతీపై విచారణ జరిపించాలంటూ కేంద్రాన్ని కోరుతున్నారు. మరి అందుకు కేంద్రం అంగీకరిస్తుందో లేదో చూడాలి. పవన్‌ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వైఎస్‌ జగన్‌ పేరెత్తితేనే మండిపోతుంటారు. చంద్రబాబు విషయంలో మరి ఈ ఇద్దరు నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

READ  పుచ్చకాయ ట్రక్కుల్లో రూ.4లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు

Related Posts