లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

నాశనం చేస్తా…పళ్లు కొరుకుతూ సీఎం సీరియస్ వార్నింగ్

Published

on

Madhya Pradesh Chief Minister “లవ్ జీహాద్”కి వ్యతిరేకంగా చట్టం చేయబోతున్నట్లు ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రేమ పేరుతో హిందూ మ‌తానికి చెందిన అమ్మాయిల‌ను…ముస్లింలు అక్ర‌మ ప‌ద్ధ‌తిలో పెళ్లి చేసుకుంటున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో… ల‌వ్ జిహాద్‌కు వ్య‌తిరేకంగా ఓ కఠినమైన చట్టం తీసుకురాబోతున్నట్లు గత నెలలో మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.కేవలం మతమార్పిడి ఉద్దేశ్యంతోనే హిందూ మహిళలను పెళ్లి చేసుకునేవారికి 10 ఏళ్ల పాటు క‌ఠిన శిక్ష అమ‌లు చేసే విధింగా చ‌ట్టాన్ని త‌యారు చేస్తున్న‌ట్లు న‌రోత్త‌మ్ మిశ్రా తెలిపారు. ల‌వ్ జిహాద్‌పై చ‌ట్టానికి సంబంధించిన బిల్లు(ధర్మ స్వాతంత్ర్య బిల్లు)ను రాబోయే అసెంబ్లీ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ఈ చట్టం కింద ఏ వర్గాన్ని టార్గెట్ చేయట్లేదని ఆయన సృష్టం చేశారు.ఈ నేపథ్యంలో ఇవాళ లవ్ జీహాద్ కి సంబంధించి మధ్యప్రదేశ్ సీఎం కీలక వ్యాఖ్యాలు చేశారు. లవ్ జీహాద్ కి పాల్పడే వారు నాశనమైపోతారంటూ పళ్లు కొరుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం(డిసెంబర్-3,2020)షియోర్ జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ…ప్రభుత్వం అన్ని కులాలు,అన్ని మతాలు ఇలా అందరికీ చెందినది. ఎటువంటి వివక్ష లేదు కానీ మన ఆడబిడ్డల విషయంలో ఎవరైనా ఏదైనా తప్పుడు చర్యలకు ప్రయత్నిస్తే అప్పుడు నేను వారిని విచ్ఛిన్నం చేస్తాను. ఎవరైనా మత మార్పిడికి ప్రయత్నించడం లేదా లవ్ జీహాద్ లాంటి వాటికి పాల్పడితే మీరు నాశనమైపోతారు అంటూ పళ్లు కొరుకుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చౌహాన్.ఈ సందర్భంగా రైతుల ఆందోళనలపై సీఎం స్పందిస్తూ…కాంగ్రెస్ ఎప్పుడూ రైతు వ్యతిరేకి. కాంగ్రెస్ వాళ్లు నిరాశలో ఉన్నారు,ఏదైనా ఆందోళనలు జరగాలని ఎదురుచూస్తున్నారు. ఇదే కాంగ్రెస్ గతంలో నీమూచ్,మందసౌర్ లోని రైతులపై హింసకు ఆదేశించింది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఈ విధంగా చేయాలని ప్రయత్నిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ దాన్ని అడ్డుకుని తీరుతామని చౌహాన్ సృష్టం చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *