-
Home » కనీస వయస్సు పెంచితే సిగరేట్ మానేస్తారా? యువకుల్లో ధూమపానాన్ని అరికట్టగలమా?
Health
కనీస వయస్సు పెంచితే సిగరేట్ మానేస్తారా? యువకుల్లో ధూమపానాన్ని అరికట్టగలమా?
Published
2 months agoon

minimum age for smoking help curb it : స్మోకింగ్.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పోయింది. యువకుల్లోనే ఎక్కువగా స్మోకింగ్‌కు అలవాటుపడిపోతున్నారు. సిగరెట్ తాగడమంటే అదో ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇంట్లో తెలియకుండా దొంగతనంగా కూడా సిగరేట్లు తాగేస్తున్న పరిస్థితి.. స్టయిల్ కోసం కూడా సిగరేట్ స్మోకింగ్ అలవాటు చేసుకోనేవారు లేకపోలేదు. స్మోకింగ్ చేస్తే ఆరోగ్యానికి హానికరమన్నా అలవాటు మానేసే పరిస్థితి కనిపించడం లేదు. ఇక యువకుల్లో స్మోకింగ్ దురాలవాటును అరికట్టడం కూడా కష్టమే అంటున్నారు వైద్య నిపుణులు. చిన్నప్పటి నుంచి ఇంట్లో ఎవరో ఒకరు స్మోకింగ్ అలవాటు ఉండటం.. అదే వాతావరణంలో పెరిగిన చిన్నారులు యువ్వనదశలోకి రాగానే వారు కూడా అలానే తయారువుతున్నారని అనేవారు ఉన్నారు. స్టయిల్ కోసం మొదలుపెట్టిన స్మోకింగ్ అలవాటు.. చివరికి చైన్ స్మోకర్లుగా మారిపోతున్నారు.
యువకులను దురాలవాట్ల నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలి? స్మోకింగ్ అలవాటును మానుకోవాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదే ఇప్పుడీ చర్చ.. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా పొగాకు ఉత్పత్తుల వాడకంపై ముసాయిదా తీసుకొస్తోంది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులపై సవరణ చట్టం 2020 తీసుకొస్తోంది. ఈ చట్టం కింద సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల అమ్మకాలకు అనుమతించే కనీస వయస్సును 18ఏళ్ల నుంచి 21ఏళ్ల పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. కనీస వయస్సు పెంచడం ద్వారా ధూమపానాన్ని అరికట్టడం సాధ్యపడుతుందా? అనేది చూడాలి.
ప్రస్తుతం… అమెరికా కూడా 2019 డిసెంబర్లో పొగాకు ఉత్పత్తుల కొనుగోలుకు కనీస వయస్సును 18 ఏళ్లకు ముందు 21 సంవత్సరాలకు పెంచింది.భారత్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. పొగాకు కారణంగా ఏటా 1.2 మిలియన్ల మరణాలు నమోదవుతున్నాయి. అందులో 1 మిలియన్ మంది స్మోకింగ్ కారణంగానే మరణిస్తున్నారు. భారతదేశంలో మొత్తం క్యాన్సర్లలో 27శాతం పొగాకు కూడా కారణమని తేలింది. ధూమపానం వల్ల దేశ ఆరోగ్య వ్యయం రూ.13,300 కోట్లు. ఆదాయ నష్టంతో సహా మొత్తం ఆర్థిక ప్రభావం ప్రతి ఏడాది సుమారు రూ .1.82 లక్షల కోట్లుగా చెప్పవచ్చు.
గత ఏడాదిలో బెంగుళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ ఇచ్చిన నివేదిక ప్రకారమే ఈ ముసాయిదా చట్టం అమల్లోకి వచ్చింది. 18ఏళ్ల నుంచి 20 ఏళ్ల వయస్సులో ధూమపానం అసమానతలో 39శాతం క్షీణతను చూపించింది. పొగాకుకు కనీస వయస్సును 21కి పెంచడం వల్ల యువతలో స్మోకింగ్ బాగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. అంచనాల ప్రకారం.. భారతదేశంలో 18 ఏళ్లలోపు 5,500 మంది చిన్నారులు ప్రతిరోజూ స్మోకింగ్‌కు అలవాటు పడుతున్నారంట. యవ్వనంలో సిగరేట్ స్మోకింగ్ అలవాటు పడటం ద్వారా అనేక దురాలవాట్లకు దారితీస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్‌లో 35శాతం పొగాకు వాడేవారంతా 18 ఏళ్లకు ముందే పొగాకు ఉత్పత్తులకు బానిసలు అవుతున్నారంట.. యువకుల్లో 70శాతం మంది తమ 21వ పుట్టినరోజుకు ముందు స్మోకింగ్ అలవాటు చేసుకున్నారంట.. ఇదే పరిస్థితి కొనసాగుతూ పోతే.. 250 మిలియన్ల మంది యువకులు స్మోకింగ్ సంబంధిత అనారోగ్యాలతో ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత వరకు చిన్నారులను ధూమపానానికి అలవాటు కాకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులతో పాటు అందరిపైనా ఉందని అంటున్నారు.
You may like
-
సోషల్ మీడియాపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్, ఫేక్ న్యూస్ పై ఉక్కుపాదం
-
ఫేక్ న్యూస్‌పై పిటిషన్ : కేంద్రం, ట్విట్టర్‌కు సుప్రీం నోటీసులు
-
వారానికి 4 రోజులే పని..కొత్త లేబర్ కోడ్ తీసుకురానున్న కేంద్రం
-
నిధులకు ఇబ్బందేం లేదు.. పోలవరం వేగం పెంచండి: కేంద్రం
-
విశాఖ స్టీల్ ప్లాంట్ పై బీజేపీలో రెండు మాటలు, సోము వీర్రాజు – సుజనా ఏమన్నారు ?
-
విశాఖ ఉక్కు, ప్రైవేటుకు దక్కు!

శ్రీశైలం వెళ్లే భక్తులపై ఆంక్షలు..అటవీ ప్రాంతంలో చలిమంటలు, వంటకాలపై నిషేధం

తేయాకు తోటలో కార్మికులతో కలిసి పనిచేసిన ప్రియాంకగాంధీ

నెలల నిండకముందే పుట్టేస్తున్న శిశువులు..అధ్యయనంలో విస్తుపోయే వాస్తవాలు..!!

కన్నడ నాట యంగ్ తరంగ్.. హీరో అవతార్..

గాంధీ ఆస్పత్రిలో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కు ఏర్పాట్లు : మంత్రి ఈటల

సయామీ ఖేర్ ఫొటోస్

‘అన్నమయ్య’ కస్తూరి ఇప్పుడెలా ఉందో చూశారా!

మత్తెక్కిస్తున్న మౌనీ రాయ్..

యాంకర్ మంజూష లేటెస్ట్ ఫొటోస్

‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ ఫొటోస్

కొలువులపై మాటల తూటాలు

భారత్‌పై చైనా మరో కుట్ర

భారత్ వ్యక్సిన్ డేటా చోరీ చేసిన చైనా

కరోనా టీకా వేసుకోకపోతే ఏమౌతుంది..?
