లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

పండక్కి పల్లెకు వెళ్లేదెలా? తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడుస్తాయా

Published

on

rtc buses: దసరా పండుగ దగ్గర పడుతోంది. మరి తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు నడుస్తాయా..? అంతర్రాష్ట్ర సేవలపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందా..? కనీసం పండుగ పూట అయినా రెండు ఆర్టీసీ సంస్థలు రాజీకొస్తాయా..? ఇన్ని అనుమానాలు, సందేహాల మధ్య పండక్కి పల్లెకు పోయేదెలా అని సామాన్య ప్రయాణికుడు నిట్టూరుస్తున్నాడు. రెండు ఆర్టీసీ సంస్థలు బెట్టు చేయకుండా.. తమ కోసం ఓ మెట్టు దిగాలని వేడుకుంటున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసుల పునరుద్ధరణకు సంబంధించి.. ఉన్నతాధికారుల మధ్య ఇప్పటిదాకా జరిగిన చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి. దీంతో దసరాకైనా ఆర్టీసీ గాడీ నడుస్తుందా లేదా అన్న ఆందోళన ప్రయాణికుల్లో మొదలైంది. ఇరు రాష్ట్రాల పట్టింపులు పక్కనెట్టి.. దసరాకైనా ప్రగతి రథ చక్రాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారని భావించారంతా. కానీ అదిప్పుడు అనుమానంగానే కనిపిస్తోంది.

ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు దసరాలోపు మరోసారి భేటీ అవుతామన్నారు. కానీ ఆ దిశగా ప్రయత్నాలేవీ కనిపించడం లేదు. దీంతో బస్సు సర్వీసులకు పచ్చజెండా ఊపడం అనుమానంగానే కనిపిస్తోంది.

 

రైట్.. రైట్‌.. ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులెప్పుడు?
దసరాకు ఊరెళ్లెదేలా అని ప్రయాణికుల నిట్టూర్పు
పండుగకి బస్సుల కోసం ప్రజల ఎదురుచూపులు
ప్రజారవాణా లేక ఇష్టారాజ్యంగా ప్రైవేటు దోపిడీ
ప్రైవేట్ ఆపరేటర్లు మూడింతల ఛార్జీలు వసూలు
కారులో ఒక్కొక్కకరికి రూ.1200 వసూలు
హైదరాబాద్‌-విజయవాడ మధ్య తిరుగుతున్న 18వేల కార్లు
మరింత భారంగా మారుతున్న దూర ప్రయాణం
కనీసం దసరాకైనా బస్సులు నడపాలంటున్న ప్రయాణికులు
తెలుగురాష్ట్రాల ఆర్టీసీ సంస్థలకు ప్యాసింజర్ల విఙ్ఞప్తి

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *