ఏపీ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? అప్పటి సీఎం MGR రాజధాని ప్రణాళిక ఇదేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్ర రాజధానుల విషయంలో ఆంధ్రప్రదేశ్ బాటలోనే తమిళనాడు వెళ్తోందా? చూస్తుంటే.. అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. మూడు రాజధానుల నినాదంతో ముందుకు వెళ్తోన్న ఆంధ్రప్రదేశ్ తరహాలోనే ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా రాజధాని మార్పుపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వా భూసాన్ హరిచందన్ ఇటీవల రాష్ట్ర మూడు రాజధానుల ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు.మరోవైపు తమిళనాడులోనూ రెండవ రాజధాని ఆలోచనపై చర్చలు ఊపందుకున్నాయి. సాధారణ ఎన్నికలు ఒక సంవత్సరం కన్నా తక్కువ దూరంలో ఉండటమే దీనికి కారణమని అంటున్నాయి తమిళనాడు రాజకీయ వర్గాలు..

వాస్తవానికి చెన్నైని వికేంద్రీకరించేందుకు రాజధానిని తిరుచికి మార్చడానికి ప్రణాళికలను మొదట 1983లో అప్పటి సీఎం ఎం.జి.రామచంద్రన్ రూపొందించారు. ఆయన మరణంతో రాజధాని మార్పు ప్రణాళికను పక్కన పెట్టేశారు. ఆ తరువాతి ప్రభుత్వాలు MGR ప్రణాళికపై పెద్దగా ఆసక్తి చూపలేదు.తమిళనాడు వంటి పెద్ద రాష్ట్రాలకు ప్రత్యామ్నాయ రాజధానులను అభివృద్ధి చేయకపోవడానికి ఎలాంటి కారణం లేదని నిపుణులు అంటున్నారు.దీనిని రెండవ రాజధాని అని పిలిచే బదులు ప్రాజెక్ట్ సిటీస్ షేరింగ్ క్యాపిటల్ ఫంక్షన్స్ (CSCF)అని పిలుద్దామంటున్నారు. CSCF అనేది రాష్ట్రంలోని ప్రాంతాలలో ప్రజలు, ప్రభుత్వం, వృత్తి, సామాజిక-సాంస్కృతిక కార్యకలాపాలను కలిగి ఉన్న భౌగోళిక అనుసంధానమని విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ అబ్దుల్ రజాక్ మొహమ్మద్ అన్నారు.

రాష్ట్ర రాజధానుల అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీలో మొహమ్మద్ ఒకరు. చెన్నై పెద్ద నగరాన్ని విస్తరించడానికి బదులుగా రాజధాని నగరంతో పాటు ఇతర నగరాలు విధులను పంచుకోవడం ద్వారా మానవ, ఆర్థిక వనరులను పంపిణీ చేయడానికి సహాయపడుతుంద ఆయన తెలిపారు. దీనిద్వారా చెన్నైనగరానికి వలసలు తగ్గుతాయని చెప్పారు.

ఇక్కడ భూముల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. మల్టీ కేపిటల్ సిటీలను ఉంటే ప్రజలు తమ సొంత భూమిలో పెట్టుబడులు పెట్టమని ప్రోత్సహిస్తారని మొహమ్మద్ అన్నారు. రాజకీయ, వాణిజ్య, పరిపాలన ప్రయోజనాల కోసం ప్రత్యామ్నాయ రాజధానులను ఉన్న రాష్ట్రం ఆలోచనను రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఎంజి దేవసాహయం కూడా సమర్థించారు.తమిళనాడు రాష్ట్రానికి దశాబ్దాలుగా చెన్నై రాజధానిగా కొనసాగుతోంది.. ఇప్పుడు అభివృద్ధి కార్యకలపాల దృష్ట్యా రాష్ట్ర ప్రజలకు మరో రాజధాని అవసరమే వాదన వినిపిస్తోంది. కావేరి నది ఒడ్డున తిరుచి నుంచి మరొక రాజధాని నగరాన్ని అభివృద్ధి చేయడం తప్పేం కాదని అంటున్నారు. అయితే వ్యవసాయ కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకోకుండా అమరావతిని ఎలా ప్లాన్ చేశారో అలా చేయకూడదని అభిప్రాయపడుతున్నారు.

READ  గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్‌ సిద్ధం

ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ రాజధానులను ప్రణాళిక చేయకూడదని అన్నారు. మహమ్మారి సంక్షోభం కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాదని.. వలస రావడం ప్రమాదకరమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ పరిశీలకులు రెండవ రాజధాని కోసం ఏదైనా ప్రతిపాదన చేస్తే.. ద్రావిడ మేజర్లు ఇద్దరూ రాజకీయ వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుంటే దానిని వ్యతిరేకించే అవకాశం లేదు.MG రామచంద్రన్ తరువాత సెంట్రల్ స్టేషన్, మెట్రో స్టేషన్ అని పేరు పెట్టిన AIADMK ప్రభుత్వం రెండవ రాజధాని గురించి దివంగత నేత ఆలోచనకు విముఖత చూపలేదు. రాష్ట్ర రాజధానిని వికేంద్రీకరించడం రాజకీయ, పరిపాలనా నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. రెండవ రాజధానిని హామీ ఇచ్చిన ఏ పార్టీ అయినా సార్వత్రిక ఎన్నికలలో భారీ ప్రయోజనం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

చెన్నై వెలుపల అభివృద్ధి కార్యకలాపాలపై రాజకీయ పార్టీలు తగినంత శ్రద్ధ చూపలేదని దక్షిణ జిల్లాలు, డెల్టా ప్రాంత ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. 1983లో, ఎంజిఆర్ రాజధానిని తిరుచికి మార్చాలని భావించారు. అప్పట్లో నిర్మించాల్సిన సీఎం కార్యాలయం అవశేషాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. 35 ఏళ్ల ప్రతిపాదనను పునరుద్ధరించడం ఖచ్చితంగా ఎన్నికల డైనమిక్స్‌ను మారుస్తుందని అంటున్నారు.రెండో రాజధానిని ఏర్పాటు చేయడం ద్వారా భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల డిమాండ్‌ను పెంచుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, తమిళనాడు స్టేట్ కౌన్సిల్, చైర్మన్ హరి కె తిగరాజన్ అభిప్రాయపడ్డారు. సామాజిక-ఆర్థిక అంశాలను పరిశీలిస్తే.. చాలా కంపెనీలు చెన్నై నుంచి మారడానికి ఆసక్తి చూపుతాయి.

ప్రస్తుతం చెన్నైలోని MSMEsలకు కార్యాలయ అద్దె భరించలేనిదిగా మారింది. పరిపాలన ప్రక్రియలను వికేంద్రీకరించడం వల్ల వ్యాపారం చేయడం సులభం అవుతుంది.పర్యావరణ సమస్యలను కలిగి ఉన్న పెద్ద ప్రాజెక్టులు కూడా వేగవంతం కావచ్చు. భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఇప్పటికే కొన్ని చాలావరకు ఐటీ కారిడార్లు తరలిపోతున్నాయని చెబుతున్నారు.

Related Posts