Winner of Bigg Boss Telugu 3: Singer Rahul Sipligunj

బిగ్ బాస్ విజేత రాహులే!? : సెకండ్ ప్లేస్‌లో శ్రీముఖి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

నిజానికి ఫస్టు నుంచీ శ్రీముఖినే విజేత అవుతుంది అని అందరూ భావించారు. చాలా సందర్భాల్లో తనలోని మెచ్యూరిటీ లెవల్స్, ఎనర్జీ రేంజ్, ప్రతీ నామినేషన్‌లో ఆమె సెఫ్ అవుతూ ఉండడం.. బయట సెలబ్రిటీలు అనేకమంది ఆమెకు సపోర్ట్ చెయ్యడం. రాహుల్‌తో ఫాల్తుదానా, యాంకరింగ్ చేసుకునేవాళ్లు కూడా అనే మాటలూ పడడం.. సింపతీ గెయిన్ అవ్వడం.. అందరితోనూ గొడవలైనాసరే వెంటనే తమాయించుకుని దోస్తీ చేయడం. ప్రతి పోటీలో ముందు ఉండడం ఇలా టాస్క్‌లు బాగా ఆడడం.. ఇలా ఆమెలో చాలా ప్లస్‌లే ఉన్నాయి. అయితే చివరకు మాత్రం చిల్లర చిల్లర వ్యాఖ్యలతో ఏ మాత్రం సీరియస్ నెస్ లేకుండా కనిపించే రాహుల్ సిప్లిగింజ్ విజేతగా నిలిచాడు.

తొలి రెండు సీజన్లు మగవారే విన్నర్లు కాగా.. ఇప్పుడు ఆడవారికి ఛాన్స్ ఇస్తారేమో అని అందరూ అనుకున్నారు. ప్రేక్షకుల అంచనాలను తగ్గట్టుగానే ఓట్లు వచ్చి పడ్డాయి శ్రీముఖికి. సినిమా ధియేటర్లలో సైతం శ్రీముఖి ఓటింగ్ కోసం ప్రమోషన్ సాగింది. బిగ్ బాస్ 3 విన్నర్ శ్రీముఖి ఖాయం అని అనుకుంటున్న టైంలో.. అనూహస్యంగా వెనకబడింది ఈ బుల్లితెర బ్యూటీ. లాస్ట్ రెండు వారాల్లో రాహుల్ ముందుకు దూసుకొచ్చాడు. తన క్యాస్ట్ (కులం) రివిల్ చేయటంతో ఒక్కసారిగా ప్రేక్షకుల మనస్సులను దోచేశాడు. ఫైనల్స్ రేసులో సెకండ్, థర్డ్ అనుకున్న రాహుల్ ఏకంగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ అయ్యాడు. శ్రీముఖి కంటే రెండు శాతం ఓట్లు అధికంగా వచ్చినట్లు తెలుస్తుంది. ఈ మేరకు వార్తలు లీక్ అయ్యాయి.

నిజానికి రాహుల్‌ కంటే శ్రీముఖి స్ట్రాంగ్.. కానీ చివర్లో రాహుల్ కోసం చాలా పాజిటివ్ క్యాంపెయిన్ నడిచింది. అంతేనా? ప్రైజ్ మనీ గెలిస్తే బార్బర్ షాపు పెడతా అంటూ జెన్యూన్‌గా చెప్పడం.. తెలంగాణ సెంటిమెంట్, పక్కా పాత బస్తీ టైపు లాంగ్వేజ్, పునర్నవి ప్రేమాయణం, మొదట్లో వెళ్లాల్సిన రాహుల్ చివరి వరకు వెళ్లడానికి ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. తన కలర్ గురించి కానీ, తన ప్రాంతీయత గురించి, తన కులవృత్తి గురించి అన్నీ చాలా ఓపెన్‌గా చెప్పుకుని చివరికి విజేతగా నిలిచాడు. ఇక మొదటి నుంచి వివాదరహితుడిగా ఉన్న వరుణ్ సందేశ్ మూడవ స్థానంలో బాబా భాస్కర్ నాల్గవ స్థానంలో.. అలీ రెజా ఐదవ స్థానంలో నిలిచినట్లుగా తెలుస్తుంది. 

Related Posts