లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌’.. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్..

Published

on

wishing-lieutenant-ram-dulquer-salmaan-a-very-happy-birthday

మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌ర్నీ మెప్పిస్తున్నారు. ‘మ‌హాన‌టి’ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన దుల్క‌ర్ ఇప్పుడు త్రిభాషా చిత్రంలో న‌టిస్తుండడం విశేషం. తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ సినిమా రూపొంద‌నుంది. హ‌ను రాఘ‌వ‌పూడి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు.Dulquer Salmaan లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్‌ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమా కాన్సెప్ట్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో ఓ యువ‌కుడు, యువ‌తి చేయి ప‌ట్టుకుని ఉన్నాడు.Dulquer Salmaan ‘యుద్ధంతో రాసిన ప్రేమ‌క‌థ‌’ అనే క్యాప్ష‌న్ సినిమాపై ఆస‌క్తిని రేపుతుంది. 1964 నేప‌థ్యంలో తెర‌కెక్కే పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరి ఇది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతమందిస్తున్నారు. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమాస్ బ్యాన‌ర్‌లో ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *