లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

ఒక్క రోజే లక్ష కొవిడ్ కేసులతో అమెరికా రికార్డ్

Published

on

Coronavirus: కరోనావైరస్ కేసుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆల్ టైం రికార్డ్ నమోదు చేసుకుంది. శుక్రవారం 24గంటల్లోనే లక్ష కొత్త ఇన్ఫెక్షన్లు ఫైల్ చేసుకుని గతంలో రోజుకు 91వేల రికార్డును దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 233మందికి పాజిటివ్ వచ్చి వరల్డ్ రికార్డ్ క్రియేట్ అయింది.

ఇండియాలో సెప్టెంబర్‌ నెల ఒక్కరోజులోనే 97వేల 894కేసులు నమోదై భయం పుట్టించింది. పది రోజులుగా ఐదు సార్లు యునైటెడ్ స్టేట్స్ గతంలో ఉన్న కేసులను దాటేసి జులైలో నమోదైన 77వేల 299కేసులను అధిగమంచేసింది.గత రెండ్రోజులుగా డైలీ ఇన్ఫెక్షన్లను బట్టి చూస్తుంటే సెకనుకో కేసు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం యూఎస్ ప్రెసిడెన్షియల్ ఎన్నికలకు నాలుగు రోజుల ముందే ఇలా జరగడం ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటివరకూ కొవిడ్-19 మహమ్మారి కారణంగా దాదాపు 2లక్షల 30వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ జనాభాలో 3శాతం అంటే మొత్తం కలిపి 9మిలియన్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం.. 16 అమెరికా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్లు పీక్స్ కు చేరుకున్నాయి. 13రాష్ట్రాల్లో రికార్డు లెవల్స్ కు చేరుకుని కొవిడ్-19 పేషెంట్లు హాస్పిటలైజ్ అయ్యేలా చేశాయి.

అక్టోబరులో 31 రాష్ట్రాల్లో కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. నవంబరు 3న ప్రెసిడెన్షియల్ ఎన్నిక ఒహియో, మిచిగాన్, నార్త్ కరోలినా, పెన్సిల్వానియా, విస్కోన్సిన్ లో జరగనుంది. గురువారం ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ రివల్ జో బిడెన్‌లు ఫ్లోరిడాలో ర్యాలీలో పాల్గొననారు.

జాతీయవ్యాప్తంగా గత వారం నమోదైన కేసులు యునైటెడ్ స్టేట్స్‌లో రోజూ లక్ష కేసుల యావరేజ్ కు చేర్చగా.. ఇండియాలో ఒక్క సెప్టెంబర్ 17వ తేదీ మాత్రమే 97వేల 894మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

అమెరికాలో ఉండే ప్రతీ పదివేల మందిలో 272మందికి కరోనా వస్తుండగా ఏడుగురు వరకూ చనిపోతున్నారు. యూరప్‌లో ప్రతీ పదివేల మందికి 127 కేసులు నమోదవుతుండగా నలుగురు చనిపోతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *