కిడ్నాప్ చేసి స్నేహితులతో కలిసి భార్యపైనే సామూహిక అత్యాచారం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జీవితాంతం భార్యకు తోడునీడగా ఉండాల్సిన భర్తే బరి తెగించాడు. ఆమెకు ఏ కష్టం రాకుండా చూసుకోవాల్సిన అతడు దారుణానికి ఒడిగట్టాడు. భార్యను(28) కిడ్నాప్ చేయడమే కాకుండా స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడు. మత్తు మందు ఇచ్చి రెండు రోజులపాటు ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు ఆ భర్త. ఆ తర్వాత భార్యను రైల్వే ట్రాక్ దగ్గర పడేసి వెళ్లిపోయాడు. స్పృహలోకి వచ్చిన బాధితురాలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు భర్తను, అతని ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్ లో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అదనపు కట్నం కోసం వేధింపులు:
ప్రభుత్వ అంబులెన్స్ విభాగంలో పనిచేస్తున్న ఓ వ్యక్తికి 2016లో అదే ప్రాంతానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. పెళ్లి చేసుకున్న కొన్నిరోజుల తర్వాత అదనపు కట్నం కోసం ఆమెను హింసించడం మొదలుపెట్టాడు. గర్భవతి అని కూడా చూడకుండా కొట్టడంతో ఆమెకు గర్భస్రావమైంది. దీంతో భర్త వేధింపులు ఇక తట్టుకోలేనని భావించిన ఇల్లాలు 2018 నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. తన గర్భం పోవడానికి భర్తే కారణం అంటూ పోలీసు కేసు పెట్టింది.

భార్యని కిడ్నాప్ చేసి ఫ్రెండ్స్ తో గ్యాంగ్ రేప్:
దీంతో ఇద్దరికీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. కాగా, జూలై 24వ తేదీన కౌన్సిలింగ్ సెంటర్ కి వచ్చిన భార్యని భర్త కిడ్నాప్ చేశాడు. ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ దారుణంగా రేప్ చేశాడు. అంతటితో ఆగని ఆ దుర్మార్గుడు తన ముగ్గురు స్నేహితులను పిలిపించాడు. వారితోనూ ఆమెని గ్యాంగ్ రేప్ చేయించాడు. మత్తు మందు ఇచ్చి 2 రోజులు ఆమెకు నరకం చూపించాడు. ఆ తర్వాత ఆమెను సమీపంలోని షాహి రైల్వే స్టేషన్ సమీపంలోని ట్రాక్ మీద పడేసి వెళ్లిపోయాడు.

స్పృహలోకి వచ్చాక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. తనకు జరిగిన దారుణం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె శాడిస్ట్ భర్త, అతడి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

Related Posts