లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

వివాహేతర సంబంధం – ఇద్దరు ఆత్మహత్యాయత్నం

Updated On - 1:31 pm, Mon, 18 January 21

woman and man commits suicide over illegal affair guntur district : వివాహేతర సంబంధం కుటుంబ సభ్యులకు తెలిసిపోయిందని భయపడిన ఇద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. ప్రియురాలు చనిపోగా ప్రియుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గుంటూరు జిల్లా యడ్లపాడు గ్రామానికి చెందిన ఉప్పరెట్ల సునీత(28) అనే మహిళకు కానీషా అనే వ్యక్తితో కొన్నేళ్ళక్రితం పెళ్లైంది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.

సునీత యడ్లపాడుకే చెందిన వేణుగోపాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇటీవలి కాలంలో ఈ విషయం ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. దీంతో వారిబంధం కొనసాగించేందుకు అవకాశం లెదని భావించి ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి కాకుమాను శివారులోకి వెళ్ళి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.

ఈవిషయాన్నివేణుగోపాల్ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు చెప్పాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకునే సరికి సునీత మృతి చెందిఉండగా, వేణుగోపాల్ అపస్మారక స్ధితిలోకి వెళ్ళాడు. వెంటనే అతడ్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సునీత మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.