లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

సర్పంచ్ గా గెలిచాడని భర్తను భుజాలపై ఊరేగించింది

Published

on

woman carries husband on shoulders : ఎన్నికల్లో తన భర్త గెలిచాడని ఆ భార్య ఎంతో సంతోషం వ్యక్తం చేసింది. అంతేకాదు..తన సంతోషాన్ని వినూత్నంగా పంచుకుంది. భర్తను భుజంపై మోస్తూ..సంబరాలు జరుపుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటు చేసుకుంది. అక్కడ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఖేడ్ తాలూకాలోని పలు అనే గ్రామంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో గెలుపొందిన తర్వాత..ఎలాంటి సంబరాలు జరుపుకోవద్దని, విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడంపై కలెక్టర్ నిషేధం విధించారు.

సంబరాల్లో ఐదుగురి కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని విజయం సాధించిన అభ్యర్థులకు సూచించారు. సంతోష్ గౌరవ్ అనే వ్యక్తి పోటీ చేశాడు. గెలుపొంది సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 44 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై గెలిచాడు. పలు గ్రామంలో ఉన్న 7 స్థానాల్లో సంతోష్ కు చెందిన జఖ్మట్ట దేవి గ్రామ వికాస్ పానెల్ ఏకంగా 6 స్థానాలను కైవసం చేసుకుంది. మాజీ సర్పంచ్ బాబన్ సావంత్, వికాస్ సొసైటీ ఛైర్మన్ రాందాస్ సావంత్ మద్దతుతో సంతోష్ ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందాడు. దీంతో ఆనందంతో ఉప్పొంగిపోయిన భార్య రేణుక..అతడిని భుజాలపై ఎక్కించుకుని..ఊరంతా తిప్పుతూ ఊరేగించింది. కేవలం ఐదుగురితోనే రేణుక సంబరాలు జరుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.