చెత్త యార్డ్‌లో రూ.3కోట్ల విలువైన బంగారం పారేసుకున్న మహిళ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Jewellery in garbage: చెత్తలో పాత పర్సు అని పారేసుకున్న మహిళ తర్వాత రియలైజ్ అయింది. అందులో రూ.3కోట్ల విలువైన బంగారం ఉందనే విషయం తెలుసుకోగలిగింది. మహారాష్ట్రలోని పూణెలో ఉంటున్న రేఖా సులేకర్ దీపావళి సందర్భంగా ఇల్లు క్లీన్ చేస్తూ.. పాత పర్సుని చెత్త యార్డ్ లో పడేసింది. అలా జరిగిన కొద్ది గంటల తర్వాత గానీ గుర్తుకు రాలేదు అందులో విలువైన బంగారం ఉందని..

వెంటనే సులేకర్ కుటుంబం పూణెలో నిర్వహణ బాధ్యతలు చూసే పింపిరి ఛించ్వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ (పీసీఎమ్సీ)ను కాంటాక్ట్ అయింది. వాళ్ల ఓ డంపింగ్ యార్డ్ పేరు చెప్పి అక్కడికి వెళ్లి వెదకాలని సూచించారు. తోడుగా కార్పొరేషన్ వర్కర్ ను పంపారు. 18వేల కిలోల చెత్త ఉన్న యార్డులో ఎట్టకేలకు పర్సును వెదకగలిగారు. విలువైన వస్తువులన్నీ కాస్త డ్యామేజ్ మాత్రమే అయ్యాయి.ఇలాంటి ఘటనే మరొకటి:
గుర్తు తెలియని బ్రిటిష్ కపుల్ ఇలాంటి ఘటనే ఒకటి ఎదుర్కొన్నారు. 15వేల పౌండ్లను రీసైకిలింగ్ లో భాగంగా.. ఇంట్లో పాత బాక్సులు అన్నీ సెంటర్ లో వదిలేశారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఆ డబ్బు చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు ఆ బాక్సు పడేసిన కారు గురించి సీసీటీవీల్లో సెర్చింగ్ చేశారు.

ఇటీవలే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన వస్తువులు రీసైక్లింగ్ లో భాగంగా వాటిని వదిలేసినట్లు తెలిసింది. కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ సహాయంతో ఆ కపుల్ ఆచూకీ తెలుసుకున్న పోలీసులు వారికి ఆ డబ్బును అందజేశారు. ఆ చనిపోయిన వ్యక్తికి డబ్బులు వేర్వేరు ప్రదేశాల్లో దాచే అలవాటు ఉందని ఆ కపుల్ అంటున్నారు. చెత్త ఉంటుందని భావించిన బాక్సులో డబ్బులు ఉన్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోవడం వారి వంతైంది.

Related Tags :

Related Posts :