లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime News

వయ్యారి వలపు వలతో, ధనవంతులు విలవిల….డబ్బున్నోళ్ళే టార్గెట్

Published

on

డబ్బునోళ్లను టార్గెట్ చేసుకుని వారితో పరిచయాలు పెంచుకుని లైంగికంగా వారిని రెచ్చకొట్టి….తన అందంచందాలతో లొంగదీసుకుని…. వారితో సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియోలుతీసి…. వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న మహిళ ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది.

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన ఓ మహిళ పట్టణంలో ఆర్ధికంగా స్ధిరపడిన వ్యక్తులను గుర్తిస్తుంది. ఏదో ఒక రకంగా వారితో పరిచయాలు పెంచుకోవటం మొదలెడుతుంది. వారితో స్నేహం చేయటం మొదలెట్టి…. తన అందంతో వారిని తన వైపుకు తిప్పుకుంటుంది.క్రమంగా వారిని మాటలతో రెచ్చగొట్టి శారీరకంగా లోంగదీసుకుంటుంది. వారితో చనువు పెరిగిన తర్వాత వారితో రాసలీలలు ఆడుతుంది. ఆసమయంలో వారికి తెలియకుండా వీడియోలు ఫోటోలు తీయటం మొదలెడుతుంది. తర్వాత వాటిని చూపించి వారిని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి వారి వద్దనుంచి డబ్బులు వసూలు చేయటం అలవాటుగా చేసుకుంది.ఇటీవల పాల్వంచ లోని శాస్త్రి రోడ్డుకు చెందిన ప్రముఖ వ్యాపారిని ట్రాప్ చేసి వలలో వేసుకుని అతనితో శృంగారం జరిపింది. ఆ సమయంలో అతనికి తెలియకుండా వీడియోలు తీసింది. అనంతరం ఈ విషయాన్ని వ్యాపారికి చెప్పి బెదిరించటం మొదలెట్టింది. మనిద్దరం సన్నిహితంగా ఉన్నవీడియో నాదగ్గర ఉందని… నాకు రూ. 10 లక్షల రూపాయలు ఇవ్వాలని… లేకపోతే ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించింది.

ఇందుకోసం పాల్వంచ, ఇల్లెందుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ మహిళ తరుఫున వ్యాపారితో డబ్బుల కోసం రాయబారం చేశారు. పరిస్ధితి అర్ధం చేసుకున్నవ్యాపారి అంత డబ్బుఇచ్చుకోలేక పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఇచ్చిన ప్లాన్ ను వ్యాపారి అమలు చేశాడు.అంత మొత్తం ఇచ్చుకోలేనని, కొంత ఇస్తానని చెప్పి మహిళను ఆ ఇద్దరు వ్యక్తులను రమ్మని కబురు పంపాడు. డబ్బులు తీసుకోటానికి వచ్చిన ఆ ముగ్గురిని అక్కడే మాటు వేసిన పోలీసులు అరెస్టు చేశారు. మహిళ ఫోన్ నుస్వాధీనం చేసుకుని పరిశీలించగా మరికొందరు ప్రముఖ వ్యాపారులతో సన్నిహితంగా ఉన్న వీడియోలు ఫోటోలు లభ్యమయ్యాయి.మహిళ వలలో కేటీపీఎస్‌ డీఈ స్థాయి అధికారి, మరో ఫోర్‌మెన్, భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి కూడా వలపు వలలో చిక్కినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇంకెంత మంది ఉన్నారు….ఇంకెందరు చిక్కారో, ఏ స్ధాయిలో డబ్బులు కాజేశారో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఒక అంగన్ వాడి సెంటర్ కు చెందిన మహిళ సహాకారం కూడాఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *