వివాహేతర సంబంధం…లవర్ తో కలిసి భర్తను చంపేసిన భార్య

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్యలను భర్తలు, భర్తలను భార్యలు కడతేరుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. తన సంబంధానికి..ఆనందానికి అడ్డుగా వస్తున్నాడనే కారణంతో భర్తనే చంపేసింది భార్య.

ప్రియుడితో కలిసి ఈ దారుణానికి తెగబడింది. ఈ ఘటన అర్ధరాత్రి మార్కాపురం పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్టేట్‌లో చోటు చేసుకుంది. మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్ర దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.

పూలసుబ్బయ్య కాలనీలో ఎల్లంగారి వెంకటేశ్వర్లు అలియాస్‌ వెంకటేష్‌ (32), భార్య అశ్వనితో నివాసం ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే…టి.దేవరాజ్‌తో అశ్వని సన్నిహితంగా మెలిగేది.

ఇది వెంకటేష్ కు తెలిసింది. పద్ధతి మార్చుకోవాలని సూచించాడు. కానీ పరిస్థతిలో మార్పు రాలేదు. ఇరువురి మధ్య తరచూ గొడవలు జరిగాయి. ఈ క్రమంలో…నెల రోజుల క్రితం అశ్వని, దేవరాజ్‌లు ఇంటి నుంచి వెళ్లిపోయారు.

తన భార్య ఎక్కడకో వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం తర్వాత.. వారిద్దరూ తిరిగి వచ్చారు. మరోసారి శుక్రవారం కూడా వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయి. అశ్వని, వెంకటేష్‌ కలిసి దేవరాజ్‌ ఇంటికి వెళ్లారు. ముగ్గురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

ఈ సమయంలో…అశ్వని, దేవరాజ్‌లు కలిసి బలమైన వస్తువుతో వెంకటేష్‌పై దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. అనంతరం వారిద్దరూ పరారయ్యారు.
వెంకటేశ్ బావ జయరాములు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు.

Related Posts