కొడుకు పుట్టలేదని ఆడ పసికందును చంపేసిన తల్లి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Madhya Pradesh : తనకు కొడుకు పుట్టలేదని కోపంతో ఆడ పసికందును దారుణంగా చంపేసిందో తల్లి. అమ్మ స్థానంలో ఉండి బాగోగులు చూసుకుంటుంది. కానీ ఈమె మాత్రం ఆ తల్లి స్థానానికి మాయని మచ్చ తీసుకువచ్చింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.ఆడ వారిని రక్షించుకుందాం..బేటీ బచావో..అంటూ ప్రభుత్వాలు మొర పెట్టుకుంటున్నా..చైతన్యం తెచ్చే ప్రయత్నం చేసినా..కొంతమంది మారడం లేదు.

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో Khajuri గ్రామ నివాసి సరిత Dehariya Kalan ప్రాంత నివాసి Sachin Mewada తో 14 నెలల క్రితం వివాహం జరిగింది. అనే మహిళ నెల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన కుమార్తె కనిపించడం లేదంటూ…బుధవారం ఇంటి నుంచి బయటకు పరుగెత్తుతూ..స్థానికులకు తెలియచేసింది.ఈ సమయంలో..అత్తా, మామలు బయట కూర్చొగా, భర్త పొలం పనులకు వెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. సమీపంలో ఉన్న నీటి డ్రమ్ములో ఆడ పసికందు డెడ్ బాడి కనిపించింది. తల్లి సరితపై అనుమానం కలిగింది.తమదైన శైలిలో విచారణ జరపగా..పసికందును చంపేసింది తల్లేనని నిర్దారించారు. కొడుకు కావాలని అని అనుకుందని, కానీ..అలా కాకపోవడంతో ఆడ పసికందును నిర్లక్ష్యంగా వ్యవహరించేదన్నారు Sub-Inspector LD Mishra. సంతోషంగా ఉండకపోయేదని, అందుకే పసికందును చంపేసిందన్నారు.

Related Posts