లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వీడిన మిస్టరీ : భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

Published

on

Woman, lover arrested ,held for murdering husband in Karnataka : కర్ణాటకలోని బన్నర్ ఘట్ లో ఆర్నెల్ల క్రితం జరిగిన హోటల్ యజమాని హత్య కేసులో అతని భార్య, హోటల్ లో పనిచేసే వ్యక్తి నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బన్నర్ ఘట్ లో హోటల్ నడుపుతున్నశివలింగ (45)ను అతని భార్య శోభ(44) హోటల్ లోపని చేసే ఉద్యోగి రాము (45) హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

నిందితులిద్దరూ గతేడాది జూన్ 1న శివలింగను హత్య చేశారు. హత్యనంతరం రాము ఇంట్లోని రూ.1.30లక్షలతో పరారయ్యాడు. భార్య శోభ బంధువులు స్నేహితులకు తప్పుడు సమాచారం ఇచ్చింది. అయితే శివలింగ సోదరుడు పుట్టరాజు శోభ,రాముల మధ్య ఉన్న అక్రమ సంబంధంపై పోలీసుల వద్ద సందేహం వెలిబుచ్చాడు. ఆ కోణంలో దర్యాప్తు మొదలెట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

హతుడు శివలింగ తోటడగద్దదహళ్లి గ్రామంలో రోడ్డు పక్కన తోపుడు బండిపెట్టుకుని హోటల్ వ్యాపారం నడిపేవాడు. వ్యాపారంలో లాభాలు బాగా రావటం మొదలయ్యి, వ్యాపారం అభివృధ్ది చేసే క్రమంలో మరో హోటల్ ప్రారంభించాలనుకున్నాడు. అందుకోసం వేరే చోట మరోక హోటల్ ప్రారంభించాడు. మొదటి హోటల్ ను అతని భార్య శోభ, పనివాడు రాము చూసుకునేవారు.

శివలింగ కొత్త హోటల్ వద్ద వ్యాపారాన్ని అభివృద్ది చేసే క్రమంలో అక్కడే ఉండేవాడు. పాత హోటల్ వద్ద ఉన్న రాము, క్రమంగా శోభతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. భర్తకు దూరంగా ఉన్న శోభ కూడా రాముకు సహకరించింది. ఈక్రమంలో గతేడాది మార్చి నెలాఖరునుంచి దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించారు. కొత్త హోటల్ మూసివేసి శివలింగ ఇంటివద్ద ఉన్న పాతహోటల్ కు తిరిగి వచ్చాడు.
                                                  నిందితుడు రాము
karnataka murder

ఆసమయంలో భార్య శోభ, పనివాడు రాముల మధ్య అక్రమ సంబంధాన్ని గుర్తించాడు. వివాహేతర సంబంధం మానుకోమని భార్య శోభను హెచ్చరించాడు. అయినా ఆమె భర్త మాటలను పెడ చెవిన పెట్టింది. రాముతో వివాహేతర సంబంధాన్నికొనసాగించసాగింది. భర్త హెచ్చరించిన విషయం రాముకు చెప్పింది. దీంతో ఇద్దరూ కలిసి శివలింగను హత్య చేయాలనినిర్ణయించుకున్నారు.

జూన్ 1వ తేదీన శివలింగను హత్య చేసి మదనాయక హళ్లిలోని ఒక తోటలో మృతదేహాన్ని పడేశారు. కొద్ది రోజులకు కుళ్లిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. లాక్ డౌన్ కారణంగా సమీపంలోని ఏ పోలీసు స్టేషన్ లోనూ మిస్సింగ్ కేసు నమోదు కాకపోవటంతో పోలీసులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇలా ఉండగా కునిగల్ గ్రామంలో నివాసం ఉంటున్న శివలింగ తల్లితండ్రులు, కొద్ది రోజులుగా తమ కుమారుడి యోగక్షేమాలు తెలియకపోవటంతో అతడ్ని సంప్రదించటానికి ఫోన్ లో ప్రయత్నం చేశారు. అతడి ఫోన్ స్విచ్చాఫ్ రావటంతో కోడలు శోభకు ఫోన్ చేసారు వారు. ఇంట్లోని లక్షా 30 వేల రూపాయలు తీసుకుని తన భర్త ఇంట్లోంచి వెళ్లిపోయాడని, అవి అన్నీ ఖర్చైన తర్వాత ఇంటికి రావచ్చని అత్తమామలకు సమాధానం చెప్పింది.

శోభ మాటల్లో ఏదో కీడు శంకించిన ఆమె మరిది, శివలింగ సోదరుడు పుట్టరాజు… కనపడకుండా వెళ్లిపోతే పోలీసు కంప్లయింట్ ఇచ్చారా అని ప్రశ్నించాడు. అందుకు ఆమె లేదని సమాధానం చెప్పింది. ఆమె మాటలకు అనుమానం వచ్చిన పుట్టరాజు… శోభ గురించి ఎంక్వైరీ చేయటం మొదలెట్టాడు. ముందు పోలీసు కంప్లయింట్ ఇవ్వమని అతను వదినకు చెప్పాడు. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేయలేదు.

పుట్టరాజు ఎంక్వైరీలో శోభకు,రాముతో ఉన్న అక్రమ సంబంధాన్ని గుర్తించాడు. శివలింగ మరణంపై శోభ రాములపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు విచారణ చేపట్టారు. గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయిన మృతదేహంపై విచాణ జరిపారు.

నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారు హత్యచేసిన విషయాన్ని ఒప్పుకున్నారు. శివలింగను హత్యచేసి మృతదేహాన్ని పడేసిన చోటు చూపించమని అడగ్గా మదనాయకహళ్లిలోని తోట కు తీసుకువెళ్లి చూపించారు. ఆరునెలల క్రితం దొరికిన గుర్తుపట్టని మృతదేహాం కేసు మిస్టరీ వీడింది. కేసు దర్యాప్తులో ఉంది.