కాళ్లు, చేతులు లేకుండా మొండెంతో పుట్టిన శిశువు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మధ్యప్రదేశ్‌లో ఓ అరుదైన జననంతో పేరెంట్స్ తో పాటు, డాక్టర్లకు కూడా షాక్ అయ్యారు. జెనెటిక్ డిసార్డర్ కారణంగా ఓ శిశువుకు కాళ్లు, చేతులు లేకుండా పుట్టింది. మధ్యప్రదేశ్ లోని సిరోంజ్ తహసీల్ పరిధిలోని సాకా గ్రామంలో జూన్ 26న ఈ ఘటన జరిగింది. Autosomal recessive congenital disorder కారణంగా ఇలా జరిగింది. దీనినే టెట్రా అమేలియా అని కూడా అంటారు.

ఇది ఉన్న శిశువులకు జననంలో కాళ్లు, చేతులు లాంటి అవయవాలు ఉండవు. నాలుగు ప్రధాన శరీర భాగాలు లేని బిడ్డను తల్లి ఎత్తుకుంది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవి కాకుండా బిడ్డకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవని డా. సురేశ్ అగర్వాల్ అంటున్నారు.

రాజీవ్ గాంధీ స్మృతి హాస్పిటల్ పీడియాట్రిషియన్ పూర్తి ఆరోగ్యంగా ఉందని.. మున్ముందు హెల్త్ చెకప్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పాప ప్రసవం ఇంటి దగ్గరే జరిగిందని.. పేరెంట్స్ అప్పటి దాకా హాస్పిటల్ కు తీసుకెళ్లాలని అనుకోలేదేని చెప్పారు.

Related Posts