లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

టీనేజ్ బాలికతో మహిళ అసహజ చేష్టలు – బాలిక ఆత్మహత్య

Published

on

Woman sexually abuses, blackmails 16-year-old girl; held after minor commits suicide : కేరళలోని త్రిసూర్ లో దారుణం జరిగింది. 16 ఏళ్ల టీనేజ్ బాలికను బెదిరించి….భయపెట్టి స్వలింగ సంపర్కానికి పాల్పడి, ఆత్మహత్యకు కారణమైన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాది  క్రితం జరిగిన  ఆత్మహత్య  కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు.  ఏడాది క్రితం కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని  ఆత్మహత్య చేసుకుంది.

ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ ఆమె మరణానికి కారణాలు వారికి ఎక్కడా క్లూ లభించలేదు. కేసు దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. ఆధారాల కోసం వెతుకుతూనే ఉన్నారు. చివరికి బాలిక ఉపయోగించిన సెల్ ఫోన్ కాల్ డేటాను విశ్లేషించారు. సెల్ ఫోన్ లో అభిరామి అనే మహిళతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను గుర్తించారు. ఎక్కువ సార్లు ఆ మహిళతో మాట్లాడినట్లు గుర్తించారు.

పోలీసులు ఫోన్ నెంబర్ ఫోటోలు ఆధారంగా అభిరామిని అదుపులోకి తీసుకున్నారు. మరణించిన బాలికకు తన క్లాస్ మేట్ ద్వారా అభిరామి పరిచయం అయ్యింది. పోలీసు విచారణలో నిజాలు కక్కించారు. అభిరామి బాలికను భయపెట్టి స్వలింగ సంపర్కంలోకి దింపింది. అప్పటికే బాలిక వేరే యువకుడితో ప్రేమలో ఉండగా…అతనితో ప్రేమను తెంచుకోమని  తనతోనే ఉండమని అభిరామి వత్తిడి చేసింది. అభిరామి బెదిరింపులు తట్టుకోలేని బాలిక ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుని తనువు చాలించింది.

పోలీసులు సాక్ష్యాలు చూపించటంతో నిందితురాలు నేరం ఒప్పుకుంది. అభిరామిపై ఐపీసీ సెక్షన్ 377 (అసహజమైన సెక్స్) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.