లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

బాగా ఎక్కేసింది : మద్యం స్టోర్ లో మహిళ రచ్చ రచ్చ..లక్షలు విలువచేసే బాటిల్స్ ధ్వంసం

Published

on

UK Woman Smashes Hundreds of Alcohol Bottles : యూకేలోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ కౌంటీ..స్టీవనేజ్ సిటీలోని ఆల్డి స్టోర్‌కు బుధవారం (నవంబర్ 24,2020) పట్టపగలు మిట్టమధ్యాహ్నం ఓ మహిళ మద్యం స్టోర్ లో రచ్చ రచ్చ చేసిపారేసింది.కనిపించిన మద్యం సీసాల్ని నేలకేసి కొట్టి పగులగొట్టింది. నానా రభసా చేసింది. దీంతో స్టోర్ లో ఉన్న సిబ్బంది ఆమెను అడ్డుకునేందుకు యత్నించగా వారిపై కూడా బాటిల్స్ విసిరే యత్నంచేసింది.దగ్గరకొస్తే లాగిపెట్టి పెట్టి కొడతనంటూ మద్యం బాటిల్స్ పట్టుకుని వీరంగం ఆడింది. దీంతో స్టోర్ సిబ్బంది ఆమె దరిదాపులకు వెళ్లటానికి కూడా భయపడిపోయారు. అలాగని వెళ్లకుండా ఉందామంటే చేతికందిన బాటళ్లను నేలకేసి కొడుతూ నానా యాగీ చేస్తోంది. దీంతో వేరే దారిలేక సిబ్బంది పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. మీరు వెంటనే రాకపోతే మా స్టోర్ లో మొత్తం బాటిల్స్ అన్నీ నేలపాలైపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు.పైగా ఆ సమయంలో జరగకూడదనిది ఏమన్నా జరిగితే…అంటే పొరపాటున ఏ ఫైర్ అన్నా జరిగితే మొత్తం అంతా బుగ్గిపాలైపోతుందని స్టోర్ సిబ్బంది ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.అప్పటికే ఆమె చేతికి గాయాలు కూడా అయ్యాయి. గాయాలై రక్తం కారుతున్నా ఆమె అదేమీ పట్టించుకోకుండా వరుసపెట్టి లక్షల విలువైన మద్యం బాటిల్స్ పగులగొట్టేస్తుండటం పోలీసులకు ఆమె ఆమె మానసిక స్థితిపై అనుమానం వచ్చింది. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించి అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.కాగా మహిళ మానసిక పరిస్థితి బాగోకపోవడం..పైగా ఆమె మద్యం తాగి ఉండటంతోనే ఆమె అలా ప్రవర్తించిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను చూసివాళ్లంతా ఆమె ఎన్ని బాటిల్స్ పగులగొడితే ఇంత రచ్చ రచ్చగా కనిపిస్తోందంటారు? అనుకుంటున్నారు.మందుబాబులైతే ‘‘వాయమ్మో..ఎన్ని బాటిల్స్..ఎన్ని బాటిల్స్.. బంగారంలాంటి మందుని నేలపాలు చేసేసావు కదే’’ అంటూ గుండెలు బాదేసుకుంటున్నారు.ఇక్కడునన్న ఫొటోలు చూస్తే స్టోర్‌లో మహిళ ఏరేంజ్ లో విధ్వంసం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *