లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

దొంగగా మారిన క్లబ్ సింగర్

Published

on

woman thief munmun hussain involved in 3 theft cases in hyderabad : పశ్చిమ బెంగాల్ లోని 24 పరగణాలకు చెందిన మహిళ బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి…క్లబ్బుల్లో, ఈవెంట్లలో సింగర్ గా జీవనం సాగించింది. క్లబ్బుల్లో క్యాబరేలను నిషేధించటంతో ఉపాధి కరువైంది. అప్పటికే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడటంతో చోరీల వైపు దృష్టి సారించింది.

దేశంలోని పలు నగరాలకు విమానంలో రాకపోకలు సాగిస్తూ ఆక్కడ ఉండే ప్రముఖ దుకాణాలు, షాపింగ్ మాల్స్ లో కొనుగోలుకు వచ్చిన మహిళల హ్యాండ్ బ్యాగులు, విలువైన వస్తువులు చోరీ చేసి పారిపోయేది. పలు చోరీ కేసులతో సంబంధం ఉన్న చోర్ సింగర్ ను ఇటీవల ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈమె చేసిన చోరీలకు సంబంధించి హైదరాబాద్ లోనూ కేసులు నమోదయ్యాయి. సైఫాబాద్, ఆబిడ్స్ పోలీసుస్టేషన్లలో మూడు కేసులు ఆమెపై ఉన్నాయి. పోలీసులు తెలిపిన ఆమె నేర చరిత పరిశీలిస్తే….

పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాకు చెందిన మున్‌మూన్‌ హుస్సేన్‌ కొంతకాలం పాటు కోల్‌కతాలో సింగర్‌గా పని చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చి బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌లో క్యాబరే సింగర్‌గా మారింది. మరోవైపు గణేష్ ఉత్సవాలు, పెళ్లిళ్లలోనూ పాటలు పాడేది. హైదరాబాద్ నగరంలో క్యాబరేలను నిషేధించటంతో ఆమెకు ఆర్ధిక ఇబ్బందులు మొదలయ్యాయి. గణేష్ ఉత్సవాలు సీజన్ ఉన్నప్పుడు, పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పుడు మాత్రమే ఆమెకు ఆదాయం లభించేది. మిగిలిన రోజుల్లో డబ్బకు కటకట ఏర్పడి దొంగతనాలు చేయటం మొదలు పెట్టింది.

తెలుగు వాడైన తమిళ్ హీరో విశాల్ తల్లి 2009 లో హైదరాబాద్ లో జరిగిన ఓ ఫంక్షన్ కు హాజరయ్యారు. అదే నెల 15న ఆమె పట్టు చీరలు కొనేందుకు బషీర్ బాగ్ లోని ధర్మవరం సిల్క్ శారీస్ షోరూం కు వెళ్లారు. అక్కడ తన బ్యాగు పక్కన పెట్టి ఆమె చీరలు సెలక్ట్చ చేసే పనిలో పడ్డారు. అంతా అయ్యాక బిల్ పే చేద్దామని చూస్తే ఆమె హ్యాండ్ బ్యాగ్ మాయమయ్యింది. అందులో రూ. 65 వేల నగదు, రూ. 30 లక్షల విలువైన వజ్రాల నగలు, సెల్ ఫోన్ ఉన్నట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు విచారణ చేపట్టారు.

ధర్మవరం సిల్క్ శారీస్ షోరూం పాతది కావటం వల్ల అప్పటికి ఆదుకాణంలో సీసీ కెమెరాలు అమర్చలేదు. పోలీసులకు దొంగను గుర్తించటం కష్టంగా మారింది. ఈ నేపధ్యంలో బ్యాగులు చోరీ చేసే పాత నేరస్తుల వివరాలు తీశారు. అందులోనూ చోరీ జరిగింది చీరల షాపులో కనుకు ఈ పని మహిళా దొంగే చేసి ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఆ కోణంలో దర్యాప్తు మొదలెట్టగా… చిక్కడపల్లి సూర్యనగర్ లో నివసించే మున్‌మూన్‌హుస్సేన్‌ అలియాస్‌ మున్‌మూన్‌ బౌరా అలియాస్‌ రచన పేరు బయటకు వచ్చింది.

ఆమె కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు 2009 ఆగస్టు 12న అదుపులోకి తీసుకుని విచారించగా…. నేరం అంగీకరించింది. ఆమె ఇచ్చిన సమాచారంతో రూ.30 లక్షలు విలువైన వజ్రాల నగలు, సెల్ ఫోన్, స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. రూ.65 వేల నగదు ఖర్చై పోవటంతో అది రికవరీ కాలేదు.

అనంతరం 2010 మే 13న మూన్ మూన్ హుస్సేన్, ఆదర్శ్ నగర్ లోని బాలాజీ గ్రాండ్ బజారులో మరో చోరీ చేసింది. కుందన్ బాగ్ కు చెందిన ఒక మహిళ బ్యాగును చోరీ చేసింది. అందులో రూ. 20వేలు నగదు. తులం బంగారం ఉన్నాయి. ఈ కేసులోనూ సైఫాబాద్ పోలీసులు మూన్ మూన్ ను అరెస్ట్ చేశారు. ఈ చోరీకి ముందు ఆబిడ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ నేరం చేసింది. ఆమె పై పోలీసుల నిఘా పెరగటంతో తన మకాం బెంగుళూరుకు మార్చింది. అక్కడి నుంచి చోరీల స్టైల్ మార్చింది.

విమానాల్లో తిరుగుతూ చోరీలు చేసేది. ఉదయం ప్రముఖ నగరాలకు వెళ్లటం అక్కడ చోరీ చేసి సాయంత్రం తిరిగి బెంగుళూరు చేరుకోవటం చేసేది. ఈక్రమంలో కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాల్లో చోరీలు చేయనారంభించింది. డిసెంబర్ 17 ముంబై పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెపై హైదరాబాద్ నగరంలో నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్ లో ఉండటంతో హైదరాబాద్ పోలీసులు ముంబై పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *