లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

భర్తపై అనుమానం పెంచుకుంది..కత్తితో దాడి చేసింది..చివరకు

Published

on

Stabs Husband : అనుమానం పెనుభూతంగా మారిపోతుంది. ఈ అనుమానాల వల్ల హత్యలు, ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా..భర్తపై అనుమానం పెంచుకుంది ఓ భార్య. వేరే స్త్రీతో సంబంధం ఉందని, అతను పెట్టుకున్న మొబైల్ వాల్ పేపర్ ను చూసి అనుమానించసాగింది. చివరకు కత్తితో దాడి చేసింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సీన్ కట్ చేస్తే…అసలు విషయం తెలుసుకుని బాధ పడసాగింది. ఈ ఘటన మెక్సికో సిటీలో చోటు చేసుకుంది.

లియోనారా ఎన్, జువాన్ లకు వివాహం అయి చాలా సంవత్సరాలు అయ్యింది. వీరిది ప్రేమ వివాహం. తాము ప్రేమించుకున్న సమయంలో తీసుకున్న ఫోటోలు పూర్తిగా పాడయిపోవడం గమనించాడు జువాన్. వాటిని డిజిటలైజ్‌ చేయించాలని భావించాడు. అనుకున్నట్లుగానే..డిజిటలైజేషన్‌ చేయించడంతో అవి మరింత అందంగా ఉన్నాయి. ఈ ఫొటోలో భార్యత ఎంతో స్లిమ్ గా అందంగా కనబడింది. ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోను జువాన్ తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నాడు. ఓ రోజు భార్య లియోనోరా చూసింది.

జువాన్ పక్కన ఉన్నది వేరే యువతిగా భావించింది. అంటే..పెళ్లికి ముందే..మరో స్త్రీతో రిలేషన్ లో ఉందని అనుమానించింది. అదే కోపంతో..అతనిపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. అసలు ఎందుకు దాడి చేసిందో అర్థం కాలేదు. బతుకు జీవుడా..అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీసి సమాచారాన్ని పోలీసులకు తెలియచేశాడు.

అనంతరం అక్కడకు చేరుకున్న పోలీసులు జువాన్ భార్య లియోనోరాను అదుపులోకి తీసుకున్నారు. కత్తితో దాడి ఎందుకు చేశావని పోలీసులు ప్రశ్నించారు. తన భర్త..మరో స్త్రీతో సంబంధం ఉందని..మొబైల్ నెంబర్ లో ఉన్న వాల్ పేపర్ విషయాన్ని చెప్పింది. ఆ ఫొటో తన భార్యదేనని, డేటింగ్ చేసే రోజుల నాటి ఫొటోను డిజిటలైజ్ చేయించానని చెప్పాడు జువాన్. ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేశారు.