Woman who drank 40 cups of tea daily gets buried in teabag coffin

చివరి కోరిక తీరింది: రోజుకు 40 చాయ్‌లు.. ఆఖరికి అంతిమ యాత్రలో కూడా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఛాయ్ ప్రేమికులు కోకొల్లలు. ఎంత అలసట అయినా ఒక్క ఛాయ్ తాగితే చాలు ఇట్టే మాయమైపోతుందనే నమ్మకంతో గడిపేస్తుంటారు. ఇలా రోజుకు 5, 10, 20టీలు తాగే వ్యక్తులను చూసే ఉంటాం. కానీ, ఒక్క రోజులో 40 టీలు తాగేంతగా చాయ్ మీద ప్రేమ ఉన్న వ్యక్తులను అరుదుగా చూస్తాం. అంత ప్రేమ ఉన్న వ్యక్తి అంతిమ యాత్ర కూడా టీ బ్యాగులోనే జరిగిందంటే నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే. 

యూకేలోని లీసెస్టర్‌షైర్ ఉండే టీనా వాట్సన్ తన చివరి కోరికను కూతురికి ముందుగానే చెప్పిందంట. దీంతో పెద్ద టీ బ్యాగులో ఆమె డెడ్ బాడీ ఉంచి దాంతో పాటు టీ బ్యాగులు వేసి పూడ్చిపెట్టారు. దీని గురించి ఆమె కూతురుమాట్లాడుతూ.. ‘అమ్మకు చాయ్ అంటే చాలా ఇష్టం. రోజుకు 30నుంచి 40వరకూ ఛాయ్ కప్పులు తాగేది. నాలుగేళ్ల క్రితమే తన చివరి కోరిక గురించి నాకు చెప్పింది. సీరియస్ గా చెప్పడంతో పెద్ద టీ బాక్సు ఏర్పాటు చేసి అందులో టీ బ్యాగులు ఉంచాం. తన చివరి కోరిక తీరిందని అనుకుంటున్నా’ అని మృతురాలి కూతురు తెలిపింది.

వాట్సన్ 73ఏళ్ల పాటు బతికి గుండెపోటుతో చనిపోయింది. రెండు సార్లు క్యాన్సర్ ను ఎదుర్కొని బయటపడగలిగింది. 14ఏళ్ల క్రితం ఏదో పురుగు కుట్టి ఇన్‌ఫెక్షన్ రావడంతో కాలును తొలగించారు. వాట్సన్ ఎప్పుడూ తాను టీ తాగేందుకే బతికి ఉన్నానని చెప్పేదంట. మా అమ్మ స్వర్గం నుంచి చూసి తన అంతిమ యాత్ర చూసి మురిసిపోతుందని వాట్సన్ కూతురు చెప్పుకొచ్చింది. 

Related Posts