అంబులెన్స్‌లో అత్యాచారం, కరోనా బాధితురాలిపై డ్రైవర్ అఘాయిత్యం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

COVID 19 Kerala : కరోనా సోకిన మహిళా రోగులను వదలడం లేదు కామాంధులు. కోవిడ్ – 19 బారిన పడిన మహిళను ఆసుపత్రికి తీసుకెళుతుండగా..అంబులె్న్స్ లో అత్యాచారం జరిపాడు డ్రైవర్. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. కరోనా వ్యాధి సోకితే..కరోనా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (NOP) ప్రకారం రోగులను అంబులెన్స్ ద్వారానే ఆసుపత్రికి తీసుకెళ్లడానికి అనుమతినిస్తారు.
Pathanamthitta జిల్లాలో ఓ మహిళకు కరోనా వ్యాధి సోకింది. దీంతో ఆమెను శనివారం రాత్రి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. డ్రైవర్ అంబులెన్స్‌ ను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆసుపత్రికి వచ్చిన తర్వాత..జరిగిన ఘోరం గురించి సిబ్బందికి తెలియచేసింది.

సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డ్రైవర్ Noufal ను అదుపులోకి తీసుకున్నట్లు, Pathanamthitta జిల్లా పోలీసు సూపరిటెండెంట్ కె.జి. సైమన్ తెలిపారు. బాధితురాలి నుంచి సేట్మెంట్ రికార్డు చేశారు. 2019లో నమోదైన ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Related Posts