అనుమానస్పద స్థితిలో తలలేని మహిళ మృతదేహం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Uttar Pradeshలో మరో కిరాతక ఘటన జరిగింది. మీరట్‌లోని స్మశానవాటిక సమీపంలో తలలేని మహిళ మృతదేహం కనిపించింది. జంతువులు తలను తీసుకెళ్లిపోయి మహిళ శరీరాన్ని వదిలేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

సిటీ అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ .. అఖిలేష్ నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. లిసేరి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ముస్లిం స్మశానవాటిక వెనుకవైపు ఓ శవాన్ని గుర్తించాం.‘తల లేకపోవడంతో అది మహిళ మృతదేహంగానే గుర్తించగలిగాం. తలను సగం లాక్కెళ్లినట్లుగా కనిపిస్తుంది. మృగాలు తీసుకెళ్లినట్లుగా అనుమానిస్తున్నాం’ అని సింగ్ పేర్కొన్నారు.

పరిసర ప్రాంతాల్లోనూ, సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజీల్లో పోలీసులు చెక్ చేస్తున్నారు. ‘కేసుపై పూర్తి శ్రమ పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు’ అని ఆఫీసర్ చెప్పారు. కేసు గురించి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నామని పోలీసులు అంటున్నారు.

Related Tags :

Related Posts :