లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

Women ఫైట్.. టాయిలెట్ పేపర్ల కోసం కోర్టుకెక్కారు!

Published

on

Women Fight Over Toilet Paper At Australia Supermarket Amid Coronavirus Fears

అవసరం అలాంటిది మరి.. వయస్సుతో సంబంధమేముంది కావాలనుకున్నది చేజిక్కించుకోవాలనే ప్రయత్నంలో ఏం చేయడానికైనా వెనుకాడరు. ఓ సూపర్ మార్కెట్లో టాయిలెట్ పేపర్ల కోసం 23ఏళ్ల యువతి, 60ఏళ్ల మహిళ కొట్టుకుని న్యాయం కోసం కోర్టు మెట్లెక్కారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఈ ఘటన జరిగింది. 

కరోనా ఎఫెక్ట్‌తో టిష్యూ, టాయిలెట్ పేపర్లు పంపే చైనా.. ఒక్కసారిగా పంపడం ఆపేసింది. దీంతో వినియోగదారుల్లో భయం మొదలైంది. చాలా షాపుల్లో దొరకకపోతుండటంతో కనిపించిన ప్రతి చోటా కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ షాపింగ్ మాల్లో యువతి ట్రాలీ నిండా… టాయిలెట్ పేపర్ బండిల్స్ ప్యాకెట్లను నింపేసుకుని కొనుగోలు చేయాలనుకుంది. 

ఇంతలో 60 ఏళ్ల మహిళ తనకు ఓ ప్యాకెట్ కావాలని అడిగింది. దానికి నిరాకరించిన యువతి ముందు నేనే తీసుకున్నాను. ఆ మొత్తం నాకే కావాలి అంది. షాప్ రూల్స్ ప్రకారం.. మనిషికి ఒక ప్యాకెట్టే అమ్ముతారు ఆ విషయం చెప్పి కచ్చితంగా తనకు ఇవ్వాల్సిందేనని గట్టిగా అడిగింది. తిట్లు మితిమీరి కొట్టుకునేదాకా వెళ్లింది. 

ఆ యువతికి సపోర్ట్‌గా మరో మహిళ రావడంతో 60ఏళ్ల మహిళ వెనక్కి తగ్గింది. కానీ, గొడవను ఆపేందుకు వచ్చిన షాప్ కీపర్లు పోలీసులకు సమాచారం అందించారు. ఇద్దరిపై కేసు పెట్టిన పోలీసులు విచారణకు ఏప్రిల్ 28న కోర్టుకు వెళ్లాలని సూచించారు. ఆ రేంజ్‌లో గొడవ జరిగినప్పటికీ  సూపర్ మార్కెట్ వాళ్లు… ఇద్దరు మహిళలకూ చెరో టాయిలెట్ ప్యాకెట్ మాత్రమే ఇచ్చారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *