Women to get Erection Needs for 13.41 minutes in India while on Romance with their partners

మేజిక్ నెంబర్: ఇండియాలో ఆడవాళ్ల భావప్రాప్తికి పట్టేసమయం 13.41 నిమషాలంట.  

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పడకగది రహస్యాలను మరోసారి సైన్స్ బైటపెట్టింది. ఆడవాళ్లను సుఖపెట్టాలంటే మగాళ్లు 100మీటర్ల పరుగుపందెంకాదు, పదికిలోమీటర్ల మారథాన్ కు సిద్ధం కావాలని అంటోంది కొత్త స్టడీ. యావరేజ్ గా ఒక అమ్మాయికి భాగప్రాప్తికలగలంటే ఎంతసమయం పడుతుందన్నది మగాళ్లకు చిక్కు ప్రశ్నగానే మిగిలింది. మగాళ్లకు తక్కువ సమయం చాలాన్నది అందరికీ తెలుసు. మరి ఆడవాళ్ల సంగతేంటి? 

కొందరికి ఆరు నిమిషాల్లోనే భావప్రాప్తి కలుగుతుంది. మరికొందరికి చాలా ఆలస్యమవుతుంది. అందుకే యావరేజ్ గా చూస్తే 13.41 నిమషాలంటూ మగాళ్ల నెత్తిమీద బండ పడేసింది స్టడీ. హాలీవుడ్ సినిమాల్లోనూ, లేదంటే నెట్ ఫ్లిక్స్ లో అమ్మాయిలు క్షణాల్లోనే సంతోషపడిపోతుంటారు. అదంతా సినిమా ఎఫెక్టేనని తేల్చేస్తోంది తాజా సర్వే. బెడ్ రూమ్ వ్యవహారాలన్నీ చాలా నెమ్మదిగా సాగుతాయంట.

Journal of Sexual Medicineలో గతవారం పబ్లిష్ అయిన తాజా స్టడీ ఈ సంగతులన్నీ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ల అభిరుచులు, మగాళ్ల పెర్ ఫార్మెన్ ఆధారంగా సగటున ఈ మేజిక్ నెంబర్ ను సైకాలజిస్టులు అంచనావేశారు. 20దేశాలకు చెందిన 645 మంది ఆడవాళ్లను సర్వేచేశారు. అందులో ఎక్కువమంది ఇండియా, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్ కు చెందినవాళ్లే ఉన్నారు.

ఈ స్టడీలో ఎంచుకున్న అమ్మాయిల సగటు వయస్సు 30ఏళ్లు. అందరికీ పెళ్లి అయ్యింది. లేదా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అందరికీ ఓ టాస్క్ ఇచ్చారు. రొమాన్స్ సమయంలో స్టాప్ వాచ్ ను స్టార్ట్ చేసి, ఎప్పుడు సెక్సువల్ గా క్లైమాక్స్ చేరారో, ఎప్పుడు భావప్రాప్తి పొందారో నోట్ చేయమన్నారు. అంతా స్టడీకోసమన్నారు.
 
మొత్తం ఎనిమిది వారాల కాలంలో భావప్రాప్తి పొందడానికి పట్టేసమయం 12.56 నిమషాల నుంచి 14.06 నిమషాల వరకు ఉంటోంది. ఇంకో సంగతి 17శాతం మందికి అసలు భావప్రాప్తే లేదంట. ఇక 68.6 శాతం మంది అమ్మాయిలకు పార్టనర్ కాస్తా చిలిపిగా, కొంతమొరటుగా బిహేవ్ చేస్తేకాని క్లైమాక్స్ చేరలేరంట. శృంగార భంగమల గురించీ స్టడీ లోతుగా వెళ్లింది. woman on top స్టైల్ ఎక్కువమందికి సంతృప్తినిస్తోందంట. 42.2 శాతంమంది కోరుకొనేనేది ఇదేనంట.

ఈ స్టడీలో పెళ్లయినా, కాకపోయినా మహిళల భావప్రాప్తి ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉంది. ఈ స్టడీకోసం మహిళలు వెల్లడించిన వాళ్ల ఇష్టాలూ క్రేజీగానే ఉన్నాయని రిపోర్ట్ కామెంట్ చేసింది. రొమాన్స్ సమయంలో సాక్స్ వేసుకుంటే సంతృప్తి మరింత పెరిగింది. ఆటలాడితే మరింత ఇష్టం. మొత్తానికి ఈ స్టడీ రొమాన్స్ లో స్లో రన్నర్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చింది.

Related Posts