భర్తతో విడిపోయినా, కోడలికి అత్తారింటిలో ఉండే హక్కు ఉంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Supreme Court : వైవాహిక జీవితంలో భర్తతో విభేదాలు వచ్చి విడిపోయినా..విడాకులు తీసుకున్న భార్య సదరు భర్త ఇంట్లో ఉండవచ్చని దేశ అత్యున్నత ధర్మాసనం అయిన సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
విడాకులు తీసుకున్నా భార్యాభర్తలు ఎవరి దారి వారు చూసుకుంటారు. ముఖ్యంగా మహిళలు విడిపోయిన భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి పుట్టింట్లోనో లేదా వేరే చోటో ఉంటుంటారు.కానీ భర్తతో విడిపోయినంత మాత్రాన వారు ఇల్లు వదిలి వెళ్లిపోనక్కరలేదని..వారు భర్త ఇంటిలోనే అంటే అత్తవారి ఇంటిలోనే ఉండవచ్చని అది అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా సరే ఆ ఇంటిలో ఉండవచ్చని సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో తాజాగా సంచలన తీర్పు ఇచ్చింది.


భర్తతో విడిపోయినా..అత్తింటి వారికి ఎటువంటి అభ్యంతరం లేకపోతే ఆ ఇంటిలో ఉండవచ్చని తెలిపింది. అత్తింటివారి ఇష్టం ఉంటే ఆమె వాని ఇంట్లోపూ ఉండేందుకు హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్నంత మాత్రాన బయటకు పంపిచే అవకాశం లేదని..ఆమె ఉండాలనుకుంటే ఉండవచ్చు..లేదా అవసరం లేదు బంధమే తెగిపోయాక నేను ఉండను అనుకుంటే వెళ్లిపోవచ్చని అది ఆమె ఇష్టంపై ఆధారపడి ఉంటుందని తేల్చి చెప్పింది.
కానీ ఆమె ఇష్టాన్ని వ్యతిరేకించే హక్కు విడిపోయిన భర్తకు లేదని స్పష్టం చేసింది. గృహహింస కేసుల విషయంలో పోరాడుతున్న మహిళలకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఊరట కలిగించిదనే చెప్పాలి. భార్యలను హింసించి ఇంటిలోంచి గెంటివేసి వారిని వదిలించుకోవాలనుకునే భర్తలకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన ఈ తీర్పు చెంప పెట్టు అని చెప్పాలి.


వివరాల్లోకి వెళితే.. స్నేహ అహుజా అనే మహిళ రవీన్ అహుజా నుంచి 2019లో విడాకులు తీసుకుంది. అయినప్పటికీ ఆమె అత్తింటిలోను ఉంటానని ఇది నా హక్కు అని చెప్పింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తన కోడలు తన ఇంటిలోనే ఉండేందుకు మామ సతీష్ చందర్ అహుజా అంగీకరించాడు. కానీ కట్టుకున్న భర్త మాత్రం తనతో విడిపోయాక నా ఇంటిలో ఆమె ఉండటానికి వీల్లేదని కొడుకు అభ్యంతరం చెప్పడంతో మా సతీష్ చంద్ర కోడలి తరపున కోర్టును ఆశ్రయించాడు.


తాము ఉంటున్న ఇల్లు తన స్వార్జితమనీ..తాను సంపాదించిన ఆస్తిలో కొడుక్కు వాటా లేదని..కొడుకు తన కోడలితో విడిపోయినా ఆమె తన కొడుక్కి మాజీ భార్య అయినా..తనకు మాజీ కోడలు అయినా సరే ఆమె వద్దే ఉంటుందని పేర్కొంటు పిటీషన్ వేయగా.. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం సదరు పిటీషన్ దారుడి అభిప్రాయాన్ని సమర్థించి అంగీకరించింది.


కోడలు స్నేహ అహుజాకు అత్తవారి ఇంటిలో నివాస హక్కు ఉందని తీర్పునిచ్చింది. విడిపోయిన అత్తమామల ఇంటిలో ఉండటానికి మహిళకు హక్కు ఉందని..దాన్ని తొలగించలేమని అభిప్రాయపడింది. ఆమెను బలవంతంగా భర్త ఇంటినుంచి పంపించేసే హక్కు లేదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సంచలన తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Related Tags :

Related Posts :