లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

భారత్ దెబ్బతో బిత్తరపోయిన చైనా…LACపై త్రివిధ దళాధిపతి క్లారిటీ

Published

on

CDS Bipin Rawat talks tough on Ladakh standoff లడఖ్ సరిహద్దుల్లో పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నాయని త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. సరిహద్దు ఘర్షణలు అతిపెద్ద సైనిక చర్యలకు దారితీసే అవకాశాన్ని కొట్టిపారేయలేమని ఓ వర్చువల్ సెమినార్​లో ప్రసంగం సందర్భంగా వ్యాఖ్యానించారు.బోర్డర్ లో చైనా దుశ్చర్యలకు భారత సైన్యం దీటుగా బదులిచ్చిన తర్వాత ఆ దేశానికి ఏం చేయాలో తెలియడం లేదని చెప్పారు. సరిహద్దులో పూర్వ స్థితిని మార్చాలని చూస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు.

నియంత్రణ రేఖ వెంబడి కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్తాన్ కు ఈ సందర్భంగా రావత్​ పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు. భారత వ్యతిరేక శక్తులకు వత్తాసు పలుకుతూ జమ్ముకశ్మీర్​లో యుద్ధవాతావరణం సృష్టించాలని చూస్తున్నందుకే పాక్ తో సంబంధాలు అట్టడుగుకు చేరాయన్నారు. భారత్​ నిర్వహించిన లక్షిత దాడులు, బాలాకోట్ దాడులు ఉగ్రవాదులను ఉసిగొల్పాలని చూస్తున్న పాకిస్థాన్​కు గట్టి సందేశమని రావత్​ స్పష్టం చేశారు.సీమాంతర ఉగ్రవాదం పట్ల భారత్ అనుసరిస్తున్న నూతన పంథాతో పాక్​లో అనిశ్చితి నెలకొందని తెలిపారు. భారత్​ ఎదిగే కొద్దీ భద్రతా సవాళ్లు ఎదురవుతాయని, అందుకే సైనిక అవసరాలకు ఇతర దేశాలపై ఆధార పడకుండా స్వయం సమృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని రావత్​ పేర్కొన్నారు. అణ్వాయుధాలు గల రెండు పొరుగు దేశాలైన చైనా,పాక్ వ్యూహాత్మక ప్రాంతీయ అస్థిరతకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *