లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

World Egg Day: ఎప్పటి నుంచి ప్రారంభమైంది? ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

Published

on

World Egg Day speacial : మనం ఎన్నో ప్రత్యేకమైన రోజులు జరుపుకుంటాం. వాటిలో కొన్ని ప్రేమను గుర్తు చేస్తే..మరికొన్ని మన బాధ్యతను గుర్తు చేస్తాయి..ఇంకొన్ని మన ఆరోగ్యాన్ని గుర్తు చేస్తాయి. అటువంటి ప్రత్యేక రోజే ‘వరల్డ్ ఎగ్ డే’ (World Egg Day). ప్రతి ఏడాది అక్టోబర్ రెండ శుక్రవారం వరల్డ్ ఎగ్ డేని జరుపుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవటానికి గల కారణాలేంటి..జరుపుకోవటం వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా ‘ఎగ్ డే’ జరపాలని 1996లో వియన్నాలో జరిగిన సమావేశంలో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్(ఐఈసీ) నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే నేడు(2020లో అక్టోబర్ 9) ఎగ్ డే జరుపుకుంటున్నాం.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

గుడ్లు తినడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల్లో అవగాహన కల్పించాలని తద్వారా ప్రజల ఆరోగ్యంపై అవగామన పెంచాలనే ఉద్ధేశ్యంతో వియన్నాలో జరిగిన సమావేశంలో మేధావులు..ఆరోగ్య నిపుణులు సూచించారు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

దీంతో ప్రపంచ ఎగ్ డే ప్రాచుర్యంలోకి వచ్చింది. మానవ శరీరానికి పోషకాల అందించడంలో గుడ్లకు ఉన్న ప్రాధాన్యత గురించి తెలియజేయడానికే ఐఈసీ.. ఈ ఆలోచన నిర్ణయాన్ని తీసుకుంది.

మనం తీసుకునే సమతుల్య ఆహారంలో గుడ్డు చాలా ప్రత్యేకమైనది. పైగా సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే ధర గుడ్డుకు ప్రత్యేకతను తీసుకొచ్చిందని చెప్పాలి. ఎంత పేదవారైనా వారానికి కనీసం ఒక్కసారైనా గుడ్డును తింటారు. గుడ్ల వినియోగాన్ని ప్రోత్సహించడానికి, గుడ్డు వినియోగాన్ని పెంచాలనే ఆలోచనతో ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ 1964లో ఏర్పాటైంది.

ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాలు వరల్డ్ ఎగ్ డేను నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. గుడ్డు తింటే ఎన్ని ప్రయోజనాలో అవగాహన కార్యక్రమాలు చేస్తుంటారు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

ఈ సందర్భంగా చాలా ప్రాంతాల్లో గుడ్లను ఉచితంగా పంపిణీ కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు నిరుపేదలకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.

గుడ్డు రుచికరంగా ఉండటమే కాకుండా.. ఎన్నో పోషక విలువలున్న దివ్యమైన ఆహారం.పేదల నుంచి ధనికుల వరకు..చిన్నవారి నుంచి పెద్దల వరకూ గుడ్లను తినవచ్చు. అందరికీ అందుబాటులో దొరికే ఈ గుడ్డు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. శరీరానికి లో కెలరీలు, నాణ్యత కలిగిన ప్రోటిన్స్‌ను గుడ్లు అందజేస్తాయి.

బ్యాచ్‌లర్స్ లైఫ్‌లోనైతే గుడ్లది ప్రత్యేకమైన పాత్ర. చాలా మంది అతి తక్కువ సమయంలో వంట చేసుకోవడానికి, శరీరానికి పోషకాల కోసం గుడ్ల కూర చకచకా చేసేస్తుంటారు. నాకు గుడ్డు కూర వండటం చాలా బాగా వచ్చు అని బిల్డప్ ఇస్తుంటారు బ్రహ్మాచారులు.

గుడ్లు కూరల్లోనే కాక..బ్రేక్ ఫాస్ట్ లో కూడా భాగమైపోయింది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ మొదలుకుని చాలా వంటకాల్లో గుడ్లను వినియోగించడం సర్వసాధాణమని చెప్పవచ్చు.

<script async src=”https://pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js”></script>
<ins class=”adsbygoogle”
style=”display:block; text-align:center;”
data-ad-layout=”in-article”
data-ad-format=”fluid”
data-ad-client=”ca-pub-6458743873099203″
data-ad-slot=”1057226020″></ins>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
</script>

కేవలం బాయిల్డ్ ఎగ్ మాత్రమే కాకుండా.. వివిధ రకాలుగా గుడ్డును వినియోగస్తున్నారు. ఆమ్లేట్లను ఎన్ని రకాలుగా వేస్తారో చెప్పాలంటే పేద్ద లిస్టే అవుతుంది. ఎవరి స్టైల్లో వాళ్లు గుడ్ల ఆమ్లేట్స్ వేస్తుంటారు.

ఆమ్లేట్.. బిర్యానీలు, ఎగ్ బొండాలు, ఎగ్ దోశ, ఎగ్ పరాటా..కేక్స్, ఎగ్ పికిల్స్ ఇలా ఎగ్స్ తో చేసే ఐటెమ్స్ పెద్ద చాంతాడే అవుతుంది. ఇలా రకరకాలుగా గుడ్డు రోజువారి జీవితంలో భాగమైపోయింది. ఈ ‘వరల్డ్ ఎగ్ డే’సందర్భంగా మరి మీరు కూడా గుడ్లు లాంగించేయండి…ఆరోగ్యాన్ని పెంచుకోండి..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *