World Famous Lover Review

వరల్డ్ ఫేమస్ లవర్ – రివ్యూ

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విజయ్ దేవరకొండ, ఐశ్వర్యా రాజేష్, రాశీ ఖన్నా, కేథరిన్, ఇసబెల్లా ప్రధాన పాత్రలో నటించిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ రివ్యూ..

‘పెళ్లిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’ ఇలా వరుస సినిమాలతో విజయ్ దేవరకొండ తన స్టార్ ఇమేజ్‌ను పెంచుకొంటూ టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు. అయితే రీసెంట్‌గా ఆయన సినిమాలు ప్యాన్స్ వరకూ మెప్పించినా.. బ్లాక్‌బస్టర్ రేంజ్ హిట్టును సాధించలేకపోయాయి. అయితే విజయ్ దేవరకొండ నటన మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ స్టార్ స్టేటస్‌ను పెంచుకొనే క్రమంలో విజయ్ చేసిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. 

 

World Famous Lover Review

‘మళ్లీ మళ్లీ ఇదిరానిరోజు’ లాంటి ఫీల్ గుడ్ మూవీని అందించిన క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో రూపొందిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ప్రేమికుల రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విజయ్ దేవరకొండ మళ్లీ ‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ లాంటి హిట్టును సొంతం చేసుకొన్నాడా? క్రాంతి మాధవ్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మళ్లీ పనిచేసిందా..? ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ ఉంటుందేమో అనుకున్న ఆడియన్స్‌కు ఈ మూవీ ఎలా అనిపించింది అనే విషయాలు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

(కథ) 
ఇది గౌతమ్ అనే రచయిత జీవితంలో జరిగిన కథ. ఎవరూ లేని అనాధైన గౌతమ్ ఎంబీఏ పూర్తి చేసి ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతాడు. అప్పుడే యామిని పరిచయంఅవుతుంది. ఇద్దరు ప్రేమలో పడతారు. యామిని ఫాదర్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సహజీవనం చేస్తుంటారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. గౌతమ్‌ ఉద్యోగం చేయడం కంటే రచయితగా ఎదగాలని తపిస్తుంటాడు. ఇందుకోసం తన ఉద్యోగాన్ని త్యాగం చేస్తాడు. పుస్తకం రాయకుండా ఇంట్లోనే ఉంటూ కాలం గడుపుతుంటాడు. ఇది యామినికి నచ్చదు. బ్రేక్ చెప్పి వెళ్లిపోతుంది. 

పిచ్చిగా ప్రేమించిన యామిని వెళ్లిపోవడంతో తట్టుకోలేని గౌతమ్.. తన జీవితంలో ఎదురైన సంఘటనలను తలచుకుంటూ వాస్తవిక విషయాలను జోడిస్తూ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పేరుతో ఒక పుస్తకం రాస్తాడు. అయితే అది పూర్తవకుండానే ఓ సంఘటన వల్ల జైలు పాలవుతాడు. రెండేళ్లు జైలు జీవితం గడిపి వచ్చిన గౌతమ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ పుస్తకానికి ఎలాంటి ముగింపునిచ్చాడు? గౌతమ్ జీవితంలోకి యామిని తిరిగి వచ్చిందా లేదా? అనేది తెరపై చూడాల్సిందే.

(సినిమా ఎలా ఉంది)
‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడే విజయ్ దేవరకొండ మళ్లీ ‘అర్జున్ రెడ్డి’గా మారాడని చాలా మంది ఫిక్స్ అయిపోయారు. ఆ తరువాత టీజర్, ట్రైలర్‌లతో ఇది పక్కా ‘అర్జున్ రెడ్డి’  సినిమాకు రీమేక్ అనే భిప్రాయం చాలా మందిలో వచ్చింది. రొమాంటిక్ సీన్లు, రాశి ఖన్నాతో బోల్డ్ సీన్లు, ఏకంగా నలుగురు హీరోయిన్లు విజయ్ సినిమాలో అనేటప్పటికి ఈ సినిమాపై బోల్డ్ ముద్ర పడింది. టీజర్, ట్రైలర్స్‌ని చూసి ఇది ఇంకా పెరిగింది ఆడియన్స్‌లో కాని వాళ్లు ఒక కథకు ఫిక్స్ కాగా.. తెరపై ఒక పార్ట్‌నర్, ఒక వైఫ్, ఒక ఫాంటసీ, ఒక గర్ల్ ఫ్రెండ్‌తో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేశారు. 

READ  400 ల కుటుంబాలకు దేవుడు.. మరోసారి మంచి మనసు చాటుకున్న సోనూసూద్..

ఈ కథలో గౌతమ్, యామినిలు మెయిన్ రోల్స్ అయినప్పటికీ.. కథలో భాగంగా వచ్చే శీనయ్య, సువర్ణ పాత్రలు సినిమాకి మేజర్ హైలైట్. బాగా చదువుకుని అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయాలని కలలు కనే శీనయ్య అనుకోకుండా..  బోగ్గు గని జాబ్‌లో పడతాడు. 20 ఏళ్లకే సువర్ణనిచ్చి పెళ్లి చేస్తారు. వీళ్లకి ఆరేళ్ల కొడుకు. తాను కోరుకున్న లైఫ్ దొరక్కపోవడంతో తన చుట్టూ ఉన్న ప్రేమనుపొందలేకుండా.. తను కావాలనుకున్న ప్రేమకోసం వెతుకుతుంటాడు శీనయ్య. అప్పుడే.. బొగ్గుగనికి వెల్ఫేర్ ఆఫీసర్‌గా స్మిత రావడం.. ఆమె అట్రాక్షన్‌లో శీనయ్య పడటం..శీనయ్య-సువర్ణ లైఫ్‌లో జరిగిన పరిణామాలు, చాలా ఎమోషనల్‌గా భావోద్వేగ సన్నివేశాలతో హృదయాలను హత్తుకునేలా చూపించారు దర్శకుడు క్రాంతి మాధవ్. 

ఫస్టాఫ్ చాలా హాయిగా సాగిపోయిన సినిమా.. రెండో భాగానికి వచ్చేసరికి మరీ నత్తనడక నడిచింది. బొత్తిగా వినోదం లేకపోవడం కూడా ఒక లోపం. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో దర్శకుడు తడబాటుకు గురయ్యాడనే చెప్పాలి. నిజానికి పుస్తకావిష్కరణ సభ దగ్గరే ముగించాల్సిన సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లడంతో ఆడియన్స్ బోర్ ఫీలవుతారనే  విషయాన్ని మర్చిపోయారు.

World Famous Lover Review

( నటీనటులు)
భార్యకు చదువు రాదనే భావనలో ఉండి తనకు  ఆల్ ది బెస్ట్ చెప్పిందని ఇంటికి కేబుల్ కట్ చేసే కఠిన పాత్ర, ఈ కథను రాసే గౌతమ్ పాత్రలో విజయ్ దేవరకొండ అద్భుతమైన నటన చూపించాడు. తన భార్యకు కూడా రెండు చీరలు కొనే సహజ సిద్ధమైన భార్య భర్తల ప్రేమను శీనయ్య-సువర్ణ పాత్రల్లో చూపించారు. ముఖ్యంగా బొగ్గుగని కార్మికుడిగా శీనయ్యగా విజయ్ తన యాస, భాషల్లో మెస్మరైజ్  చేశాడు విజయ్.. 

ఇక సువర్ణగా ఐశ్వర్య రాజేష్ తన పెర్ఫామెన్స్‌తో కట్టిపడేసింది. భర్త కంటే ఎక్కువ చదుకున్నా.. అతని అహం ఎక్కడ దెబ్బతింటుందోనని నిజాన్ని దాచి.. భర్త చదువుకుని మోడ్రన్‌గా ఉండే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని తెలుసుకుని గోల్డ్ మెడల్ సాధించి మోడ్రన్‌గా రెడీ అయ్యే సీన్‌లో ఐశ్వర్య రాజేష్ తాను ఏడుస్తూనే ప్రేక్షకుల కళ్లు చెమ్మగిల్లేలా చేసింది. ఇక స్మిత పాత్రలో క్యాథరిన్ తన పాత్రకు న్యాయం చేసింది.  వీటన్నిటికి మూల కథలో గౌతమ్ పాత్రకు ప్రేయసిగా మెయిన్ లీడ్ హీరోయిన్‌గా నటించిన రాశీ అల్టిమేట్‌గా ఆకట్టుకుంది. మిగతా నటీనటులు వారి పాత్రల పరిధిమేర నటించారు. 

 

World Famous Lover Review

(టెక్నీషియన్స్)
డైరెక్టర్ క్రాంతి మాధవ్ పెన్నుకి మరోసారి పదును పెట్టారు. హృదయానికి హత్తుకునే అంశాలతో ఆయన మార్క్‌ను మరోసారి చూపించారు. అలాగే తెలంగాణ యాసలో రాసిన డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇక చివర్లో కథను మరో రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. కాని అది ఎంత వరకు సక్సెస్ అయ్యిందనేది అనుమానమే. ఇల్లందు ఎపిసోడ్ విషయంలో ఆయన డైరెక్షన్ టాలెంట్ మరోసారి బయట పడింది.  

READ  ముంబైలో ప్రారంభమైన ‘ఫైటర్’

టెక్నికల్‌గా సినిమాకు మంచి సపోర్ట్ లభించింది. గోపి సుందర్ రీ రికార్డింగ్, పాటలు పర్వాలేదు అనిపించాయి. ఎమోషనల్ సీన్లను తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవెల్ తీసుకువెళ్లడంలో గోపి సుందర్ తన మార్క్ చూపించారు. కాని పాటలే అంతలా మెప్పించలేకపోయాయి. ఇక  సినిమాటోగ్రాఫర్‌ జయకృష్ణ గుమ్మడికి చేతినిండా పని దొరికింది. ఇల్లందు లాంటి గ్రామీణ వాతావరణాన్ని, ప్యారిస్ లాంటి యూనివర్సల్ అర్బన్ ఎన్విరాన్‌మెంట్‌ను అద్భుతంగా తన కెమెరా కంటితో చూపించాడు. ఎటిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది.. ప్రొడక్షన్ వాల్యూస్‌లో ఎక్కడా తగ్గకుండా బాగా సపోర్ట్ చేశారు. 

World Famous Lover Review

(ఓవరాల్‌గా)
సినిమాను సంప్రదాయం నిలబెట్టడం కోసం కాకుండా ఆధునిక జీవితాల్లో ముఖ్యంగా వివాహ వ్యవస్థలో సంభవిస్తున్న పరిణామాల చిత్రణగా నడిపి ఉంటే మరింత ప్రయోజనకరమైన చిత్రం అయ్యేది. క్లాసిక్‌గా మిగిలేది. 

ఈ ప్రయత్నం జరకగపోవడంతో ఇది ఓ యావరేజ్ సినిమాగా మాత్రమే విజయ్ దేవరకొండ కెరీర్‌లో నిలుస్తుంది. అంతే తప్ప ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే క్రెడిట్‌ను సాధించడానికి ఏడు అడుగుల దూరంలో నిలిచిపోతుంది. బాక్సాఫీస్ దగ్గర పోటీకి సినిమాలేవి లేకపోవడం ఈ సినిమాకు కలెక్షన్స్ పరంగా కలిసి వచ్చేఅంశం. 

Read Here>>గ్రేట్ న్యూస్ : కోవిడ్ – 19 (కరోనా) వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టిన కాలిఫోర్నియా!

Related Posts