సిటీ మధ్యలో సముద్రం: ప్రపంచంలోనే అతిపెద్ద వర్చువల్ వేవ్ క్రాష్‌లు

Worlds Biggest Virtual Wave Crashes Against Glass In Optical Illusion

దక్షిణ కొరియాలో D'strict కంపెనీ అనామోర్ఫిక్ పబ్లిక్ ఆర్ట్ ఇల్లస్ట్రేషన్ తయారుచేసింది. 268 అడుగుల వెడల్పు, 66 అడుగుల ఎత్తుతో... ఇది కొరియాలోనే అతి పెద్ద అవుట్‌డోర్ స్క్రీన్‌గా గుర్తింపుపొందింది. ఈ స్క్రీన్ అల్ట్రా హై డెఫినిషన్ కంటే రెండింతలు ఎక్కువ అంటే.. (7,840 x 1,952 pixels) ఉంటుంది. 

శామ్సంగ్ స్మార్ట్  LED టెక్నాలజీని ఉపయోగించి 1,620 చదరపు మీటర్ల స్మార్ట్ స్క్రీన్లో ఆర్ట్ ఇన్స్టాలేషన్ సృష్టించబడింది. దీన్ని పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పట్టింది. కానీ ఈ స్ర్కీన్ చూస్తుంటే.. నిజంగా సముద్రం దగ్గర ఉన్నంత ఫీలింగ్ వస్తుంది. మొత్తానికి సిటీ మధ్యలో సముద్రం ఉన్నట్లుగా, అలలు వస్తున్నట్లుగా చాలా అద్భుతంగా దీన్ని నిర్మించారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా... సిటీ మధ్యలో సముద్రం ఉన్నట్లుగా, అలలు వస్తున్నట్లుగా ఫీలవుతూ... కాస్త టెన్షన్లను తగ్గించుకుంటున్నారు. ఈ వీడియోను ఇప్పటికే 4లక్షలకు పైగ చూశారు. చూసినవారంతా వీడియోపై మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. 

Read: అమెరికా చట్టసభల్లో బిల్లు : H-1B వీసా జారీలో వారికే ప్రాధాన్యం! 

 

మరిన్ని తాజా వార్తలు